ఒక్క పోస్టర్ తో జగన్ పరువు తీసేసిన పవన్.. వేయండి సార్ అంటూ?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న హీరో ఎవరనే ప్రశ్నకు పవన్ కళ్యాణ్ పేరు సమాధానంగా వినిపిస్తుందనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పూర్తిస్థాయిలో సమయం కేటాయిస్తే రాజకీయాల్లో సంచలనాలు సృష్టించడం ఖాయమని ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా పవన్ సీఎం కావడం ఖాయమని చాలామంది అభిమానులు భావిస్తుండటం గమనార్హం.

కౌలు రైతుల కోసం సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును పవన్ ఖర్చు చేస్తుండటంతో ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఒక్క పోస్టర్ తో జగన్ పరువు తీసేశారు. “అప్పులు చేసి నవరత్నాలు పంచడం కాదు రోడ్లు వేయండి సీఎం సార్” అనే పోస్టర్ తో పవన్ కళ్యాణ్ ఏపీలోని రోడ్లు ఏ విధంగా ఉన్నాయో చెబుతూ జగన్ సర్కార్ లో కదలిక వచ్చేలా చేస్తున్నారు.

సరైన రోడ్లు లేకపోవడం వల్ల ఏపీలోని పలు ప్రాంతాల ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. వాహనాలకు డ్రైవర్లుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్న వాళ్లు సరైన రోడ్లు లేకపోవడం వల్ల ప్రతిరోజూ నరకం చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన రోడ్లు లేకపోవడంతో ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. సంక్షేమ పథకాల కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్న జగన్ సర్కార్ రోడ్ల కోసం ఎక్కువ మొత్తం కేటాయించడం లేదు.

గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే హ్యాష్ ట్యాగ్ తో డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్న పవన్ రాష్ట్రంలో గోతుల మధ్య రోడ్డును వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లపై పందులు స్వైర విహారం చేస్తున్నాయని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిధులు కేటాయించామని చెబుతున్న లెక్కలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేకపోవడం గమనార్హం. రోడ్లు వేయండి సార్ అంటూ పవన్ పోస్టర్ లో వేసిన సెటైర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.