ఏడాదికి 500 రోజులు కాదు… పవన్ పై సెటైర్స్ పీక్స్!

జనసేన అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన జనసేన వారాహి యాత్ర ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సాగుతున్న సంగతి తెలిసిందే. ఇండులో భాగంగా తాజాగా తాడేపల్లిగూడెంలో వారహి యాత్ర బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

అవును… తాడేపల్లి గూడెం సభలో మైకందుకున్న పవన్… తన ఏడాది సంపాదనపై కీలక విషయాలు వెళ్లడించారు. అందులో భాగంగా… తనకు ఏడాదికి వెయ్యికోట్ల సంపాదన అని అన్నారు. ప్రజల కోసం తాను ఆ వెయ్యి కోట్లు వదులుకుని రాజకీయాల్లోకి వచ్చినట్లు పవన్ చెప్పుకొచ్చారు. దీంతో ఇక వచ్చే ఏడాది నుంచి పవన్ పూర్తిగా సినిమాలు మానేస్తున్నారా అని కొంతమంది అంటుంటే… ఏడాదికి 365 రోజులే అని మరికొంతమంది గుర్తుచేస్తున్నారు.

దీంతో… రోజుకి రెండు కోట్లు సంపాదన అన్నది వాస్తవమా.. లేక, ఏడాదికి వెయ్యి కోట్లు అన్న మాట వాస్తవమా.. అదీగాక, రెండూ వాస్తవాలేనా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. రెండూ వాస్తవాలే అయితే ఐటీ వాళ్లతో జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు!

కారణం… పవన్ స్వయంగా తాను రోజుకు రెండు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటానని అనేక సందర్భాల్లో స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ విషయాన్ని గుర్తుచేస్తున్న నెటిజ్ఞలు… ఏడాదికి 500 రోజులు ఉంటాయని అనుకుంటున్నారా ఏంటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అలా కాకుండా వాస్తవంగా ఏడాదికి ఉండే 365 రోజులే కాబట్టి… అందుఇలో 52 ఆదివారాలు ఖచ్చితంగా తీసేయాలి. ఎందుకంటే… ఇండస్ట్రీలో ఆదివారం షూటింగులకు సెలవు! ఇక మిగిలిన 313 రోజులూ వితౌట్ గ్య్యాప్ పనిచేసేసినా… ఆయనకు వచ్చేది 626 కోట్లు కదా… మరి వెయ్యి కోట్లు అని ఎలా అంటున్నారు అనేది లాజికల్ ప్రశ్న అని అంటున్నారు నెటిజన్లు!

ఇదే సమయంలో “దేశంలోని ప్రముఖ నటుల్లో నేను కూడా ఒకడిని. రాజకీయాల్లోకి వచ్చే అవసరం నాకు ఉందా? ప్రజలకు ఉపాధి భద్రత కోసమే రాజకీయాల్లోకి వచ్చా..” అని పవన్ మరో విషయం చెప్పారు. దీంతో… పవన్ అడిగిన “రాజకీయాల్లోకి వచ్చే అవసరం నాకు ఉందా”? అనే ప్రశ్నకు తమరి అవసరం సంగతి తెలియదు కానీ.. ప్రజల అభిప్రాయం అయితే 2019 ఎన్నికల్లో చెప్పారు కదా అని మరికొందరు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.

ఏది ఏమైనా… ప్రపంచం మొత్తం మీదున్న మహానుభావులందరూ తనకు అదర్శం అన్నస్థాయిలో మాటలు చెప్పే పవన్… అదే నోటితో స్థిరత్వం లేని కబుర్లు చెబుతూ, తానేదో త్యాగశీలిని అన్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారన్ని మరికొందరు అభిప్రాయపడుతున్నారు! అంతకంటే ముందు… వాలంటీర్ల కు క్షమాపణ చెప్పే విషయాన్ని మరిచిపోవద్దని, మహిళా కమిషన్ ఇచ్చిన పదిరోజుల గడువులో మూడు రోజులు అయిపోయాయని గుర్తుచేస్తున్నారు!