తెలంగాణ లో అందరి ఫేవరెట్ లీడర్ గా మారిన పవన్ కల్యాణ్ .. ఒకే ఒక్క మాటతో

pawan kalyan

భగవద్గీత పార్టీ కావాలా.. బైబిల్ పార్టీ కావాలా… అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. తిరుపతిలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బైబిల్, భగవద్గీత, ఖురాన్.. ఏదైనా దేవుడి వాక్కే కదా. నేను వ్యక్తిగతంగా ఇలా విడగొట్టలేను. సమాజాన్ని అంతగా విడగొట్టడం అంటే చాలా ఇబ్బంది నేను అలా మాట్లాడలేను అని కుండబద్దలు కొట్టారు. ఎవరి మాటలు వారివి అంటూ చెప్పారు.

Political Heat Raised vakeel Saab

దేవాలయాల దాడుల విషయంలో ఆవేదన చెంది బండి సంజయ్, ఆ విధంగా మాట్లాడి ఉంటారన్నారు. ఆ స్థాయి వ్యక్తి మనసులో అలా ఉండి ఉంటే ప్రపంచం ఇలా ఉండదని పవన్ బదులిచ్చారు. తనకు ముస్లింలు, క్రైస్తవుల్లో కూడా విపరీతంగా అభిమానులు ఉన్నారని చెప్పారు. మతం అనేది చాలా సున్నితమైన అంశమని, సమాజాన్ని విడదీసేలా తాను మాట్లాడలేనని చెప్పారు.

అలాగే మతాన్ని కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఆపాదించొద్దని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక, రైతు సమస్యలపై స్పందించిన బలంగా రామతీర్థం విషయంలో రియాక్ట్ కాలేనని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎందుకంటే మతం అనేది సున్నితమైన అంశమని.. రామతీర్థ యాత్రలో తాను పాల్గొంటే వచ్చే భావోద్వేగాలు వేరుగా ఉంటాయన్నారు. అనవసరంగా అమాయకులు బలి అయ్యే అవకాశం ఉందని, తన అభిమానులు అన్ని మతాల్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. దోషులను పట్టుకోవాలన్నది తమ డిమాండ్ అన్నారు.