వైఎస్సార్ ఫ్యామిలీని ఫాలో అవుతున్న పవన్.. సీఎం కావడం ఖాయమంటూ?

సినిమా రంగంలో, రాజకీయాల్లో సెంటిమెంట్లను ఫాలో అయ్యే వాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉంటారనే సంగతి తెలిసిందే. సెంటిమెంట్లను ఫాలో కావడం వల్ల కచ్చితంగా అనుకూల ఫలితాలు కలుగుతాయని సినిమా హీరోలు, రాజకీయ నేతలు భావిస్తున్నారు. ఈ సెంటిమెంట్ల కోసం కొన్ని సందర్భాల్లో హీరోలు, నేతలు రూ.లక్షలు, రూ.కోట్లు ఖర్చు చేసిన సందర్భాలు సైతం ఉంటాయనే సంగతి తెలిసిందే.

అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విచిత్రమైన సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వినియోగిస్తున్న కారు నంబర్ టీఎస్ 07 జీజీ 2345 కాగా గతంలో వైఎస్సార్ ఫ్యామిలీ 2345 సిరీ కారు నంబర్ ను వినియోగించింది. వైఎస్సార్ ఫ్యామిలీ నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రులు అయ్యారనే సంగతి తెలిసిందే. వైఎస్సార్ ఫ్యామిలీ కారు నంబర్ ను ప్రస్తుతం పవన్ సెంటిమెంట్ గా భావిస్తుండటం గమనార్హం.

ఈ విషయం తెలిసిన పవన్ అభిమానులు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ సైతం సీఎం కావడం ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా కార్లకు ఫ్యాన్సీ నంబర్లు ఉండాలంటే భారీ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ కారు నంబర్ కోసం ఎక్కువ మొత్తం ఖర్చు చేశారని తెలుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

ప్రజలు సైతం పవన్ కు చెప్పుకుంటే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు. ఎవరైనా సమస్య చెబితే పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల కంటే రాజకీయాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. సినిమాసినిమాకు పవన్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.