Pawan Kalyan: కోటి రూపాయలు అయినా ఇస్తా…వాటిని మాత్రం ఇవ్వలేను పవన్ కామెంట్స్ వైరల్!

Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసినదే. తాజాగా ఈయన విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో 35వ బుక్ ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొన్నారు.234 స్టాళ్లతో అనేకమంది ప్రచురణకర్తలు ఈ మహోత్సవంలో పాల్గొననున్నారు. సాహితీ నవజీవన్‌ బుక్‌ లింక్స్‌ అధినేత పిడికిలి రామకోటేశ్వరరావు పేరును ఈ బుక్ ఫెస్టివల్‌ ప్రాంగణానికి పెట్టారు. ప్రధాన సాహితీవేదికకు ఈనాడు అధినేత దివంగత రామోజీరావు పేరు పెట్టారు. విద్యార్థుల కార్యక్రమాలు జరిగే ప్రతిభా వేదికకు దివంగత పారిశ్రామిక వేత్త రతన్‌ టాటాపేరు పెట్టారు. ఈ పుస్తక మహోత్సవం 2వ తేదీనుంచి 12వ తేదీ వరకు జరుగనున్నాయి.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతున్న ఒక చిన్నప్పటినుంచి కూడా పుస్తకాలు అంటే చాలా ఇష్టం. ఏదైనా ఒక మంచి పుస్తకం కనపడితే అసలు వదిలే వాడిని కాదని తెలిపారు. ఇప్పటికి కూడా నా దగ్గర ఉన్న మంచి మంచి పుస్తకాలను చాలామంది అడుగుతూ ఉంటారు కానీ నేను మాత్రం తన పుస్తకాలు ఇవ్వడానికి ఇష్టపడనని తెలిపారు.

కావలసి వస్తే ఒక కోటి రూపాయలైనా డబ్బులు ఇస్తాను కానీ తన పుస్తకాలను మాత్రం ఇవ్వనని తెలిపారు. పుస్తకాలు ఇవ్వడం అంటే నాకు నా సంపదను మొత్తం ఇచ్చిన భావన కలుగుతుందని తెలిపారు.కర్ణుడు కవచ కుండలాలను కోసేస్తే ఎలా బాధ పడుతాడో తెలీదు కానీ.. నా పుస్తకం ఇవ్వాలంటే కింద, మీద పడిపోతాను అంత మమకారం పుస్తకాలు అంటే అని పవన్ తెలిపారు. పుస్తకాలు చదవకపోతే నేను ఎలా ఉండే వాడినో అనిపిస్తుంది.

ఇక నేను ఇంటర్ కూడా చదవకుండా ఆపడానికి కూడా తరగతి గదిలో, నాకు నచ్చిన పుస్తకాలలో లేవు.రవీంద్రనాథ్ ఠాగూర్ స్కూలుకి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని చదువుకున్నాడు.. నేను ఠాగూర్ గారి ప్రేరణతో ఆయన లాగే చెట్లు, మొక్కలు చూస్తూ పుస్తకాలు పెట్టుకొని ఉండిపోయాను అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.