Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు తిక్కే కాదు.. దానికో లెక్క కూడా ఉంది… లెక్క ఎప్పుడూ తప్పదు?

Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఓ సినిమాలో నాకు తిక్కుంది దానికో లెక్కుంది అంటూ చెప్పిన డైలాగ్ భారీ స్థాయిలో ఫేమస్ అయ్యింది. అయితే రాజకీయాలలో కూడా ఈయన తనకు తిక్క మాత్రమే కాదు ఆ తిక్కకు ఓ లెక్క ఉంది అని కూడా నిరూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ 2014వ సంవత్సరంలో పార్టీ పెట్టారు కానీ 2019 ఎన్నికల సమయంలో పార్టీ సింబల్ తో ఎన్నికల పోటీ దిగారు. అయితే అప్పుడు రెండు స్థానాలలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఎక్కడ గెలవలేదు.

ఇక 2024లో 21 అసెంబ్లీ స్థానాలు రెండు ఎంపీ స్థానాలలో పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్ తో విజయం సాధించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి కూడా డిప్యూటీ సీఎం హోదాలో విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇలా పవన్ కళ్యాణ్ ఉన్నత హోదాలో ఉన్నప్పటికీ ఈయన మాత్రం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ పూర్తిగా పాలన పైనే దృష్టి సారించారు. సాధారణంగా అధికారంలో ఉన్నప్పుడు ఏ రాజకీయ నాయకుడైన తన పార్టీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తారు.

అలాగే ప్రతిపక్ష పార్టీ నుంచి కీలక నేతలను తన పార్టీలోకి ఆహ్వానిస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తే సమస్యలు తప్ప ఏమీ రావని ప్రజలపై పార్టీకి పార్టీ నాయకుల పై నమ్మకం ఉంటే చాలని పవన్ భావిస్తున్నారు. నియోజకవర్గాల్లోనూ, బూత్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసినా ప్రయోజనం లేదని భావిస్తున్నారు.

ఇలా అన్ని హంగులున్న పార్టీలు ఎన్నికల్లో ఎందుకు ఓడిపోతాయని ఆయన లెక్క. అందుకే పార్టీని బలోపేతం చేయడం కంటే.. పార్టీని జనంలోకి తీసుకెళ్లడమే ప్రధాన ధ్యేయమని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో పవన్ కళ్యాణ్ కు ఓ లెక్క ఉందని, వచ్చే ఎన్నికలలో కూడా ఈయన అదే ఫాలో కాబోతున్నారని తెలుస్తోంది.