2024లో గెలిచేది జనసేన.. పవన్ కాన్ఫిడెన్స్ మామూలుగా లేదుగా?

సినిమాల్లో హీరోలు చేసే రాజకీయాలకు, నిజ జీవితంలోని రాజకీయాలకు చాలా తేడా ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం సినిమా డైలాగ్స్ నే రియల్ లైఫ్ లో చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. 2024లో జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పవన్ కళ్యాణ్ చెబుతుండటం గమనార్హం. అయితే పార్టీ ఏ విధంగా అధికారంలోకి వస్తుందనే ప్రశ్నకు మాత్రం పవన్ సమాధానం చెప్పాల్సి ఉంది.

జనసేన పార్టీ సొంతంగా పోటీ చేసినా ఆ పార్టీ తరపున పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు. పలు నియోజకవర్గాల్లో జనసేన పార్టీని పట్టించుకునే పరిస్థితి లేదు. గోదావరి జిల్లాలు మినహా మిగతా నియోజకవర్గాలలో జనసేన పార్టీ పరిస్థితి ఏంటనే ప్రశ్నకు జవాబు సులువుగానే చెప్పవచ్చు. 2024లో జనసేన గెలుస్తుందని పవన్ అంత కాన్ఫిడెన్స్ తో చెబుతుండగా జనసైనికులలో కూడా పవన్ కు ఉన్న స్థాయిలో కాన్ఫిడెన్స్ లేదనే సంగతి తెలిసిందే.

జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత సీపీఎస్ ను రద్దు చేస్తానని పవన్ చెప్పడం గమనార్హం. అయితే జనసేన సొంతంగా పోటీ చేస్తుందా? బీజేపీతో కలిసి పోటీ చేస్తుందా? లేక మరో పార్టీతో కలిసి పోటీ చేస్తుందా? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకాల్సి ఉంది. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే పవన్ ఇచ్చిన హామీలను జనసేన నెరవేరుస్తుందో లేదో చూడాల్సి ఉంది.

జనసేన గెలుస్తుందని పవన్ నమ్మకం నిజమవుతుందో లేదో చూడాలి. మరోవైపు పవన్ బీజేపీతో కలిసి ముందుకెళతారో టీడీపీతో కలిసి ముందుకెళతారో చూడాలి. పవన్ రాజకీయాల్లో సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా అభిమానుల కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది.