పవన్ కళ్యాణ్ చెప్పులగోల.! పేర్ని నాని భుజాలు తడుముకోవడమెందుకు.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘నా చెప్పులు పోయాయ్..’ అంటూ నిన్న పిఠాపురంలో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ‘చెప్పులు పోతే నిర్మాతలు ఎవరో ఒకరు కొనిస్తారు లే.. పార్టీ గుర్తు పోయింది.. దాని సంగతి చూసుకో..’ అంటూ పవన్ కళ్యాణ్ మీద పేర్ని నాని సెటైరేశారు.

‘నా వ్యక్తిగత జీవితం మీద లేనిపోని నిందలు వేస్తున్నారు.. రాజకీయంగా విమర్శించడం చేతకానివాళ్ళు ఇలాంటి విమర్శలు చేస్తున్నారు.. ఇకపై అలాంటి విమర్శలు చేస్తే చెప్పుతో కొడతా..’ అని కొన్నాళ్ళ క్రితం జనసేన అధినేత, పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ, చెప్పు తీసి చూపించారు.. వైసీపీని ఉద్దేశించి.

అప్పుడు మొదలైంది ఈ చెప్పులగోల. అప్పటినుంచి మాజీ మంత్రి పేర్ని నాని, పవన్ కళ్యాణ్ మధ్య ‘చెప్పుల పేరుతో’ మాటల యుద్ధం జరుగుతోంది. ఈ చెప్పుల ప్రస్తావనకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఎక్కడా పేర్ని నాని పేరు తీసుకురాలేదు.

పేర్ని నాని మాత్రం, అక్కడికేదో పవన్ కళ్యాణ్ తననే చెప్పులతో కొడతానన్నట్లుగా భావిస్తున్నట్లున్నారు. ‘నా చెప్పులు పోయాయ్.. తెచ్చి ఇచ్చెయ్యండి..’ అని పవన్ కళ్యాణ్ అంటే, దానికి పేర్ని నాని స్పందించడం ఒకింత జుగుప్సాకరంగానే వుంది.

ఇలా, ఈ తరహా చర్యలతో పేర్ని నాని, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మెప్పు పొందగలరా.? రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నానని చెబుతూ, ఈ గోల ఎందుకు.? ఏమోగానీ, పేరు ప్రస్తావించకుండా పవన్ కళ్యాణ్.. పేరు ప్రస్తావిస్తూ పేర్ని నాని.. ఈ చెప్పుల పంచాయితీని కొనసాగిస్తున్నారు. అక్కడికేదో పవన్ కళ్యాణ్ చెప్పుల్ని పేర్ని నాని దొంగతనం చేసినట్లుగా మారిపోయింది వ్యవహారం.