టీడీపీ మహానాడుకి చీఫ్ గెస్ట్ గా పవన్ కల్యాణ్!

ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు “మహానాడు 2023″కు తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరిలో ఈనెల 27, 28 తేదీల్లో తలపెట్టిన మహానాడు కి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇందులో భాగంగా… మొదటి రోజున ప్రతినిధుల సభ, రెండో రోజున ఎన్టీఆర్ జయంతి, బహిరంగ సభ జరగనున్నాయి. అయితే ఈసారి మహానాడుకు ప్రత్యేక అతిధిగా పవన్ కల్యాణ్ హాజరవుతున్నారంటూ ఒక ప్రచారం తెరపైకి వచ్చింది.

ఈసారి మహానాడుకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని రాజకీయంగా ఎంతలా క్యాష్ చేసుకోవాలో అంతకుమించే చంద్రబాబు చేసుకుంటున్నారు! విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రజనీకాంత్ ప్రసంగం ఇందుకు ఉదాహరణ! అయితే ఈసారి మహానాడులో రెండోరోజు జరగబోయే ఎన్టీఆర్ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిధిగాపవన్ ను పిలవాలని భావిస్తున్నారంట బాబు & కో!

టీడీపీ మహానాడు కార్యక్రమానికి.. ఆపార్టీ శ్రేయోభిలాషి, చంద్రబాబు వెల్ విషర్, భవిష్యత్తు మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరవ్వబోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ఒక చర్చ నడుస్తుంది! హైదరాబాద్ లో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు పవన్ ను ముఖ్య అతిధిగా పిలిచారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాలతో పవన్ ఆ కార్యక్రమానికి హాజరుకాలేదు. దీంతో రాజమండ్రిలో పాల్గొనవచ్చని అంటున్నారు.

ఫలితంగా జనసేన క్యాడర్ కు కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్లు అవుతుందని.. ఇప్పటినుంచే టీడీపీ కార్యకర్తలతో కలిసి నడవడం.. జనసైనికులు కూడా అలవాటుచేసుకుంటారని బాబు భావిస్తున్నారంట! మరి ఈ కార్యక్రమానికి నిజంగానే పవన్ ను ఆహ్వానిస్తారా? లేక, ఇది మా సొంత వ్యవహారం ఇందులో పవన్ ని ఎలా పిలుస్తాం అని లైట్ తీసుకుంటారా? అన్నది వేచి చూడాలి! కానీ… ఈ కార్యక్రమానికి పవన్ హాజరైతే మాత్రం ఈసారి మహానాడులో అదే హైలైట్ అయ్యే ఛాన్స్ ఉంది!