Pawan Kalyan: జగన్ ను వెంటాడుతున్న పవన్ … ఇలా రివేంజ్ తీర్చుకుంటున్నారా?

Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ గతంలో తనని ఇబ్బంది పెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీ స్థాయిలో చుక్కలు చూపిస్తున్నారని చెప్పాలి. జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు కదులుతున్నారని చెప్పాలి. గతంలో తన పట్ల ఎన్నో విమర్శలు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తానేంటో పవన్ నిరూపిస్తూ వస్తున్నారు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి అనూహ్య నిర్ణయం పై పలువురు రాజకీయ విశ్లేషకులు చర్చిస్తూ పవన్ ఈ నిర్ణయం జగన్ పై కసితోనే తీసుకున్నారని తెలుస్తోంది. 2019 ఎన్నికలలో 151 స్థానాలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన జగన్ గత ఎన్నికలలో ఘోరంగా 11 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. దీంతో అసలు ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితులలోకి వైకాపా వెళ్లిపోయింది.

ఇలా పార్టీ ఘోర ఓటమిని చవిచూడటమే కాకుండా మరోవైపు పార్టీ నేతలపై తప్పుడు ఆరోపణలు అదేవిధంగా కొంతమంది కీలక నేతలు పార్టీ మారడం వంటివి జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇకపోతే తన పార్టీకి తిరిగి బలం రావాలంటే తాను ప్రజలలోకి వెళ్లటమే మార్గమని భావించిన జగన్ సంక్రాంతి తర్వాత ప్రతి జిల్లాలోనూ రెండు రోజుల పర్యటన చేస్తూ అక్కడ ప్రజలతో ఏకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవటానికి సిద్ధమయ్యారు.

ఇలా జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ గా పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల సంచలనం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సైతం ప్రతినెల ఒక్కో జిల్లాలో పర్యటిస్తూ అక్కడ సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇటీవల కడపలో జరిగిన దాడి తర్వాత ఈయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. ఇలా జగన్ పర్యటనకు చెక్ పెట్టడం కోసమే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారని పవన్ పర్యటన ముందు జగన్ తేలిపోతారు అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.