పవన్ కాపు రిజర్వేషన్ల ప్రకటనపై హర్షం(వీడియో)

చట్టసభల్లో బిసి లకు ప్రాతినిధ్యం కల్పిస్తానని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల కాపులు, జనసేనలో ఉన్న బిసి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కు మద్దతు తెలుపుతూ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళా క్షేత్రం వద్ద జనసేన నేత పోతిన మహేష్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే విగ్రహానికి పూల మాల వేసి అక్కడే ఏర్పాటుచేసిన పవన్ కళ్యాణ్ చిత్రపటానికి బిసి నేతలు పాలాభిషేకం నిర్వహించారు.

మరొకవైపు కాపు రిజర్వేషన్లు 9షెడ్యూల్ లో పెట్టాలన్న పవన్ వాఖ్యలను కాపు రిజర్వేషన్ పోరాట నాయకుడు ముద్రగడ పద్మనాభం స్వాగతించారు.

గుడివాడలో కాపు సేవాసమితి వార్షికోత్సవ కార్యక్రమంలో  కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభం పాల్గొన్నారు.

*కాపు కార్పొరేషన్ కు 10వేల కోట్లు ఇస్తామన్న జగన్ వ్యాఖ్యలను ఆయన  తప్పు బట్టారు. 20వేల కోట్లు ఇస్తాం వేరే జాతికి ముఖ్యమంత్రి పదవి ఇస్తారా అని ముద్రగడ్డ పద్మనాభం ప్రశ్నించారు.

కాపు  డిమాండ్లను పరిష్కరించిన  పార్టీ పల్లకినే 2019లో మొస్తామని  ఆయన ప్రకటించారు. 

గవర్నర్ ఆమోదంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాపు రిజర్వేషన్ అమలు చేయచ్చని చెబుతూ కాపు రిజర్వేషన్లు 9షెడ్యూల్ లో పెట్టాలన్న పవన్ వాఖ్యలు స్వాగతిస్తామని అన్నారు.

అదే సమయంలో ఆయన జగన్ మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు.

*జాతి ఆకలి తీరాలి,తప్ప కేసులు ఎత్తివేస్తామని జగన్ దొంగ కన్నీరు,కార్చడం విడ్డూరమని అంటూ జగన్ రాజ్యాంగాన్ని చదివినట్లు మాట్లాడటం దారుణమని కాపులకు జగన్ సానుభూతి అనవసరమని ముద్రగడ అన్నారు.

జగన్ మాట్లాడుతున్న మ ాటలలో నిలకడ లేదని, ఒకో సభలో ఒక్కో లాగా జగన్ మాట్లాడటం,హాస్యాస్పదమని ఆయన విమర్శించారు.