టీడీపీని లైట్ తీసుకున్న జనసేన.! త్రిముఖ పోటీ వైపే మొగ్గు.!

‘ఔను కదా.? మనమెందుకు తెలుగుదేశం పార్టీ ట్రాప్‌లో పడాలి.? టీడీపీ మనల్ని ఎందుకు తక్కువగా చూస్తోంది.? త్రిముఖ పోటీ వల్లనే లాభపడతామేమో.!’ ఇలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలు సాగుతున్నాయట. దాంతో, తెలుగుదేశం పార్టీ డిఫెన్స్‌లో పడిపోతోందిప్పుడు. రాత్రికి రాత్రి స్వరం మార్చేసి పవన్ కళ్యాణ్ మీద రాజకీయ విమర్శలు చేయాల్సి వస్తే, అందుకు టీడీపీ ఏమీ వెనుకాడదు. 2014 ఎన్నికల్లో తమ గెలుపుకు కారణమైన పవన్ కళ్యాణ్ మీద ఆ తర్వాత టీడీపీ చేసిన విమర్శల్ని చూశాం.

అయితే, బీజేపీ నుంచి పిలుపు కోసం ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు ఎదురుచూస్తున్నారట. ప్రధాని నరేంద్ర మోడీని గతంలో చంద్రబాబు కలిసినప్పుడు, ‘ఇంకోసారి కలుద్దాం..’ అని ప్రధాని, చంద్రబాబుతో చెప్పారని టీడీపీ అంటోన్న సంగతి తెలిసిందే. అలా కలిస్తే గనుక, బీజేపీ – టీడీపీ పొత్తు ఖాయమైపోతుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. కాగా, ఇటీవల విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించినప్పుడు, ఆయనతో భేటీ కోసం విశాఖ వెళ్ళిన జనసేన అధినేత, ప్రధానితో భేటీలో అస్సలేమాత్రం టీడీపీ ప్రస్తావన తీసుకురాలేదట. కేవలం జనసేన – బీజేపీ మధ్య సంబంధాలు, రాష్ట్రంలో వైసీపీ పాలనా వైఫల్యాలు మాత్రమే చర్చకు వచ్చాయట.

ఈ విషయమై బీజేపీలోని టీడీపీ అనుకూల బ్యాచ్ నుంచి సమాచారం తెప్పించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనానిని వ్యూహాత్మకంగా పక్కన పెట్టాలనుకుంటున్నారట. అదే సమయంలో జనసేన అధినేత కూడా, ముక్కోణపు పోటీ మీదనే ఇప్పుడు ఆసక్తి చూపుతున్నారట.