Gallery

Ankita Lokhande, Ankita Lokhande pics, Ankita Lokhande stills, Ankita Lokhandephots, Ankita Lokhande lateest pics, Ankita Lokhande gallery, hot beauty, sexy girl, model, instagram, hot...
Amritha Aiyer, Amritha Aiyer pics, Amritha Aiyer stills, Amritha Aiyer photos, Amritha Aiyer latest pics, Amritha Aiyer gallery, Amritha Aiyer images, actress, tollywood, model,...
Harshita Shekhar Gaur Harshita Shekhar Gaurpics, Harshita Shekhar Gaur hot pics, Harshita Shekhar Gaur latest stills, Harshita Shekhar Gaur new pics, Harshita Shekhar Gaur...
Aditi Prubhudeva, Aditi Prubhudeva stills, Aditi Prubhudeva lates pics, Aditi Prubhudeva photos, Aditi Prubhudeva new pics, Aditi Prubhudeva images, Aditi Prubhudeva gallery, hot  pics,...
Madhumita Sarcar, Madhumita Sarcar pics, Madhumita Sarcar gallery, Madhumita Sarcar hot pics, Madhumita Sarcar stills, Madhumita Sarcar new pics, hot pics, sexy pics, beauty,model,...
Evelyn Sharma, Evelyn Sharma pics, Evelyn Sharma latest stills, Evelyn Sharma gallery, Evelyn Sharma hot pics, Evelyn Sharma stills, Evelyn Sharma sexy pics, Evelyn...
Home Andhra Pradesh ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఏకిపారేసిన చంద్రబాబు

ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఏకిపారేసిన చంద్రబాబు

ఆంధ్ర ప్రదేశ్: ప్రతిపక్ష నేత చంద్రబాబు గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధికార ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు. తన వయసు,ఆరోగ్యం గురించీ ఆలోచించకుండా నిగ్రహం కోల్పోయి ఆవేశంలో గట్టి గట్టిగా అరిచేశారు. చంద్ర బాబు మాట్లాడుతూ… మా ఇళ్ల పైకి రాత్రిళ్లు వందలాది పోలీసులను పంపి, గోడలు దూకించి అరెస్ట్ లు చేయిస్తారా ? ముందస్తు నోటీసులు కూడా ఇవ్వరా ? మేం సంఘ విద్రోహ శక్తులమా ? మీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదా ? మేం ఎవరినైనా చంపేశామా ? దేవినేని ఉమా మహేశ్వర రావును అనేక పోలీస్ స్టేషన్లకు మార్చిమార్చి తిప్పారు. ఆయన ఏం చేశారో ఇంతవరకు చెప్పలేదు.

Opposition Leader Chandrababu Questioning Jagan Government
Opposition leader Chandrababu questioning jagan government

ఒక బూతుల మంత్రి, రౌడీ మంత్రి ఏం మాట్లాడారో చూశాం. ఇంటికొచ్చి కొడతానని దేవినేని ఉమామహేశ్వరరావుని అంటాడా, నాపై కూడా దుర్భాషలు మాట్లాడాడు. ఏంటి నీ అహంభావం… ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి. ఇన్నాళ్లూ ప్రజా సేవలో ఉండి మీ దగ్గర దెబ్బలు తినడానికి మేం ఇక్కడ ఉన్నామా…? ప్రజలకు సేవ చేయడానికి మేం ఉన్నాము, మీ దగ్గర దెబ్బలు తినడానికి కాదు అంటూ కొడాలి నానికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

అనంతపురంలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి వెళతాడా ? పోలీసులు తలుపులు తీసి అతని దౌర్జన్యాలకు సహకరిస్తారా ? సిగ్గులేదా మీకు ? ఇది డెకాయిట్ విధానం కాదా ? వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఎస్పీని ఇష్టారాజ్యంగా మాట్లాడితే, ఆయనపై ఎలాంటి కేసు పెట్టరా ? తన ఇంట్లో తలుపులు తీసిన పోలీసులను ప్రశ్నించాడని, జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసులు పెట్టారు, మరి జిల్లా ఎస్పీని నిందించిన ప్రసన్నకుమార్ రెడ్డిపై ఎందుకు కేసు పెట్టలేదో డీజీపీ సమాధానం చెప్పాలన్నారు.

దేవాలయాలపై అనేక దాడులు జరిగాయి. దాడులు చేసిన వారిపై కేసులు పెట్టకుండా, వారిని పట్టుకోవడం చేతకాక, లాలూచీపడి, చివరకు ప్రశ్నించిన మా పై కేసులు పెడతారా ? ఎవరిని బెదిరిస్తారు ? మీరేమైనా మోనార్క్ అనుకుంటున్నారా ? అందరినీ సమానంగా చూడాలి. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి ఎంత వల్గర్ గా మాట్లాడారో మనం చూశాం. ఇతను ఇప్పుడెక్కడ ఉన్నాడు ? డీజీపీ ఇంట్లో ఉన్నాడా, లేక జగన్ రెడ్డి ఇంట్లో ఉన్నాడా? ఎందుకీ రాయల్ ట్రీట్ మెంట్ ? పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి వెనుక ఉన్నదెవరు ? కడపలో బ్యాంక్ అకౌంట్ అతనికి ఎందుకు ఉంది ? రహస్యంగా ఆయనను ఎందుకు విచారిస్తున్నారో సమాధానం చెప్పాలి. వీడియోలు, రికార్డులు లేవా సాక్ష్యంగా ? ఒక మతంపై కక్షగట్టినట్లు మీరు బిహేవ్ చేస్తుంటే, మేము అడగటం తప్పా అంటూ ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నలతో ఏకిపారేశారు.

- Advertisement -

Related Posts

Seasonal Fruits: వేసవిలో దొరికే సీజనల్ ఫ్రూట్స్ వల్ల ఉపయోగాలెన్నో..!

Seasonal Fruits: సీజనల్ ఫ్రూట్స్ ను మనం చాలా ఇష్టపడతాం. ఒక నిర్దష్ట కాలంలో మాత్రమే దొరికే పండ్లను ఎవరు వదులుకోవడానికి ఇష్టపడతారు. ఇంకా చెప్పాలంటే ఆ పండ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటాం....

Etela Rajender: కేసీఆర్ ను ఢీ కొట్టేలా ఈటల స్కెచ్.. అదిరింది..!

Etela Rajender: తెలంగాణ రాజకీయాలు సీఎం కేసీఆర్ వర్సెస్ మాజీ మంత్రి ఈటలగా మారిపోయాయి. మొదటిరోజు సీఎం కేసీఆర్ పై వ్యతిరేక వ్యాఖ్యలు చేయకపోయినా.. శాఖలను తీసేసుకున్న తర్వాత ఈటల స్వరం పెంచారు....

చంద్రబాబు జూమ్ రాజకీయం: ఈసారి సౌండ్ అదిరింది.!

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని 'జూమ్'బాబు అంటోంది అధికార వైసీపీ. కరోనా మొదటి వేవ్ నేపథ్యంలో పూర్తిగా భాగ్యనగరానికి (అదేనండీ తెలంగాణ రాజధాని హైదరాబాద్) పరిమితమైపోయిన చంద్రబాబు, జూమ్ ద్వారా పార్టీ ముఖ్య...

Latest News