ఇప్పటం గ్రామస్తులకు హైకోర్టు మళ్లీ షాకిచ్చింది. ఇళ్ల కూల్చివేతకు సంబంధించి షోకాజ్ నోటీసుల విషయంలో హైకోర్టుకు సమాచారం ఇవ్వకపోవడంతో కోర్టు లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించిన సంగతి తెలిసిందే. మొత్తం 14 మందికి షోకాజ్ నోటీసులు జారీ కాగా గ్రామస్థులు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రిట్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు గ్రామస్థుల పిటిషన్ ను డిస్మిస్ చేసింది.
జనసేను నమ్ముకున్న గ్రామస్తులకు మళ్లీ షాక్ తగలడం హాట్ టాపిక్ అవుతోంది. రిట్ పిటిషన్ ను దాఖలు చేయకుండా జరిమానా చెల్లించి ఉంటే గ్రామస్తులకు బాగుండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహారాలకు ఇప్పటం గ్రామస్తులు బలవుతున్నారని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటం గ్రామస్తులకు విచిత్రమైన పరిస్థితి ఏర్పడటం ఆందరినీ ఒకింత ఆశ్చర్యపరుస్తోంది.
ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా ఇవ్వలేదని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్న గ్రామస్తులు సాధించిందని ఏంటని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అడుసు తొక్కనేల కాలు కడగనేల అనే విధంగా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి ఆశ్రయించి ఇప్పటం గ్రామస్తులు తమ గొయ్యి తామే తవ్వుకున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా గ్రామస్తులు చేసిన తప్పును తెలుసుకుని జరిమానా చెల్లిస్తే సమస్య పరిష్కారమవుతుందని చెప్పవచ్చు.
ఇప్పటం గ్రామస్తులు పదేపదే కోర్టును ఆశ్రయించడం వల్ల జనసేన పరువు కూడా పోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా గ్రామస్తులు జాగ్రత్త పడకపోతే మాత్రం భారీ స్థాయిలో గ్రామస్తులకు, జనసేనకు నష్టం తప్పదని చెప్పవచ్చు. ఇప్పటం గ్రామస్తులు జరిమానా చెల్లిస్తారో లేదో చూడాలి.