కొడాలి నాని కామెంట్ల వెనుక ఎన్టీఆర్.. సైలెన్స్ తో చుక్కలు చూపిస్తున్నాడా?

అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ కాగా స్వయంగా అమిత్ షానే ఎన్టీఆర్ తో భేటీ కోరినట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. పైకి ఆర్ఆర్ఆర్ సినిమా పేరు చెబుతున్నా ఈ భేటీ వల్ల తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో విప్లవాత్మక మార్పుల దిశగా అడుగులు పడవచ్చని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ సన్నిహితులలో ఒకరైన కొడాలి నాని తాజాగా ఈ భేటీకి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బెనిఫిట్ లేకుండా మోదీ, అమిత్ షా ఎవరితోనూ ఒక నిమిషం కూడా మాట్లాడరని కొడాలి నాని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని విస్తరించే క్రమంలో తారక్ తో భేటీకి ప్రాధాన్యత ఏర్పడిందని పొలిటికల్ గా తారక్ ను వినియోగించుకోవాలని అమిత్ షా భావిస్తున్నారని కొడాలి నాని చెప్పుకొచ్చారు. తారక్ తో బీజేపీ తమ పార్టీకి అనుకూలంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేయించే ఛాన్స్ అయితే ఉందని కొడాలి నాని కామెంట్లు చేశారు.

అయితే కొడాలి నాని ఎన్టీఆర్ అనుమతి లేకుండా మాట్లాడి ఉంటారని చెప్పలేం. అమిత్ షాతో భేటీ ద్వారా ఒకింత కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేయాలని తారక్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ కారణం వల్లే భేటీ గురించి డైరెక్ట్ గా వెల్లడించడం లేదా సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేయడం తారక్ చేయలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎంత ప్రయత్నించినా వారికి మోదీ, అమిత్ షా అపాయింట్మెంట్ లభించడం లేదు.

తారక్ ను మాత్రం స్వయంగా అమిత్ షా కలవడం గమనార్హం. తారక్ పొలిటికల్ గా ఘాటుగా విమర్శలు చేయగల ప్రతిభ ఉన్న వ్యక్తి కావడంతో పాటు తన మాటలతో ప్రజలను ఆకట్టుకోగల ప్రతిభ ఉన్న వ్యక్తి అనే సంగతి తెలిసిందే. తారక్ కు ప్రస్తుతం సినిమాల పరంగా ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. సినిమాల ద్వారా తారక్ కు కోట్ల రూపాయల ఆదాయం దక్కుతోందనే సంగతి తెలిసిందే. మరి సినిమాలకు దూరమై తారక్ రాజకీయాలపై దృష్టి పెడతారేమో చూడాల్సి ఉంది.