చంద్రబాబు, లోకేశ్ కు భారీ షాకిచ్చిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?

ఎన్టీఆర్ హెల్ట్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కొంతమంది పేరు మార్చడంలో తప్పు లేదని చెబుతుండగా మరి కొందరు గతంలో చంద్రబాబు పేర్లను మార్చడం వల్లే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. అయితే చంద్రబాబు, లోకేశ్ లకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ షాకిచ్చారు.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వివాదం గురించి తారక్ హుందాగా స్పందించినా ఆయనను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ లో #jrntrfootnaradogs అనే హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండింగ్ అవుతోంది. 32000 కు పైగా ట్వీట్లతో ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి రావడం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కావాలనే కుట్ర చేస్తే సహించేది లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి లోకేశ్ ను ముఖ్యమంత్రిని చేయాలని భావిస్తున్నారు. లోకేశ్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి నష్టమే తప్ప ఏ మాత్రం లాభం లేదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లోకేశ్ కు ఒక రాష్ట్రాన్ని పాలించడం సాధ్యం కాదని చాలామంది భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో యాక్టివ్ అయితే టీడీపీకి పూర్వ వైభవం వస్తుందనే భావన చాలామందిలో ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేసినంత మాత్రాన తారక్ రేంజ్ అణువంతైనా తగ్గదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. తారక్ ను కావాలని టార్గెట్ చేస్తే నష్టపోయేది టీడీపీనే అని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. టీడీపీ ఇలాంటి రాజకీయాలు చేయడం వల్లే ఇప్పుడు అధికారానికి దూరమైందని రాబోయే రోజుల్లో కూడా టీడీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ అయితే లేదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.