ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ కు బీజేపీపై కోపం.. ఆర్ఆర్ఆర్ కు అన్యాయమంటూ?

కొన్ని వారాల క్రితం అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను కలవగా ఆ సమయంలో ఆర్ఆర్ఆర్ ను ఆస్కార్ కు పంపించడం కోసం తారక్ అమిత్ షాను కలిశారని ఒక వర్గం మీడియా ప్రచారం చేసింది. వెరైటీ మ్యాగజైన్ అంచనాల నేపథ్యంలో మన దేశం నుంచి ఆర్ఆర్ఆర్ కు కచ్చితంగా అవకాశం దక్కుతుందని అందరూ భావించారు. అయితే మోదీ సర్కార్ మాత్రం అందరికీ షాకిస్తూ గుజరాతీ చిన్న సినిమాను ఆస్కార్ అవార్డ్ కోసం పంపింది.

ఈ విషయంలో బీజేపీ సర్కార్ పై ఎన్టీఆర్, చరణ్ అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ మూవీకి అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వక్తమవుతున్నాయి. అయితే ఇదే సమయంలో కశ్మీర్ ఫైల్స్, కేజీఎఫ్2 సినిమాలకు కూడా అన్యాయం జరిగిందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. జరుగుతున్న ఘటనల వల్ల ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ కు బీజేపీపై కోపం పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో ఏ ఎన్నికలు జరిగినా బీజేపీకి అనుకూలంగా చరణ్, తారక్ అభిమానులు వ్యవహరించే అవకాశం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఆర్ఆర్ఆర్ ను కనీసం నామినేషన్ కు పంపినా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి అంతోఇంతో అనుకూల పరిస్థితులు ఏర్పడేవి. గుజరాతీ సినిమాకు ప్రాధాన్యతనిచ్చి బీజేపీ తెలుగు సినిమాలకు కూడా ప్రాధాన్యతను ఇచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పేయడం గమనార్హం.

మరోవైపు ఈ అవార్డుకు ఎంపికైన చెహెల్లో షో నిజంగా గొప్ప సినిమానా అనే ప్రశ్నకు కాదనే సమాధానం వినిపిస్తుండటం గమనార్హం. ఈ సినిమా ఒక విదేశీ సినిమాకు అనుకరణ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ నామినేషన్ కు వెళ్లకపోవడం ఆ సినిమా అభిమానులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేస్తుండటం గమనార్హం.