చంద్రబాబుకు మోహన్ బాబు భయం ఇంకా పోలేదు!

ఈ నెల 20న హైద‌రాబాద్‌లో ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌ల‌ను నిర్వహించ‌నున్నారు. ఈ కార్యక్రమానికి సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది వ్యక్తులను, రాజకీయ నాయకులను, సీనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఆహ్వానించారు. విచిత్రంగా ఏపీలో ఈ ఉత్సవాలకు దూరంగా పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ ని మాత్రం ఈ వేడుకలకు ఆహ్వానించారు. ఏపీలో ఎందుకు ఆహ్వానించలేదనేది బహిరంగ రహస్యమే. అయితే… ఈ వేడుకల్లో పాల్గొనడానికి ఆహ్వానాలు అందుకున్నవారు – అందుకోనివారు ఎవరు.. ఎందుకు.. అనే చర్చ తాజాగా మొదలైంది.

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు జూనియ‌ర్ ఎన్టీఆర్‌ తోపాటు ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌, విక్టరీ వెంక‌టేశ్‌, ప్రభాస్, అల్లు అర్జున్, సుమ‌న్‌, ముర‌ళీమోహ‌న్, నంద‌మూరి క‌ల్యాణ్‌ రామ్‌, మాజీ ఎంపీ జయప్రధ, రాఘ‌వేంద్రరావు, అశ్వనీదత్, ఆదిశేష‌గిరిరావు త‌దిత‌రుల‌ను ఆహ్వానించారు. దీంతో… సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయి మాస్ హీరో అయిన చిరంజీవి ఏమైపోయారు – ఎన్టీఆర్ తో అత్యంత సన్నిహితంగా మెలిగిన మోహన్ బాబుకు ఎందుకు ఆహ్వానం అందలేదు అనేది హాట్ టాపిక్ గా మారింది.

కారణాలు తెలియంది కాదనేది మరో కామెంట్! కారణం… ప్రభాస్ ను ఈ ఉత్సవాలకు ఆహ్వానించ‌డం ద్వారా ఏపీలో కొన్ని నియోజకవర్గాల్లో బలంగా ఉన్న రాజుల క‌మ్యూనిటీతో పాటు ఆయ‌న ఫ్యాన్స్ కు ఆక‌ర్షించే రాజకీయ ప్రయత్నం. ఇక ప‌వ‌న్‌ క‌ల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నేలేదు. ఆయన పసుపు తానులో ముక్కై చాలా రోజులే అయ్యింది. ఇక అశ్వనీదత్ కూడా ఈ మధ్య బ‌హిరంగంగానే వైసీపీ ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు. ఇక సీనియ‌ర్ హీరో సుమ‌న్ ఇటీవ‌ల కాలంలో చంద్రబాబును పొగుడ్తున్నారు.

ఇక రాఘ‌వేంద్రరావు, మురళీమోహ‌న్‌, జ‌య‌ప్రదల‌తో చంద్రబాబు అనుబంధం గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. వీరంతా చంద్రబాబు కోటరీలో కీలక వ్యక్తులు. అయితే ఎన్టీఆర్ తో ప్రత్యేక అనుభంధం ఉన్న మోహన్ బాబుకు ఆహ్వానం అందకపోవడం గమనార్హం. ఇదే సమయంలో ఇండస్ట్రీ పెద్దగా అయినా చిరంజీవిని పిలవకపోవడం మరీ దారుణం! అయితే… ఈ కార్యక్రమానికి ప్రభాస్ – అల్లూ అర్జున్ – జూనియర్ ఎన్టీఆర్ – కళ్యాణ్ రాం లు హాజరవకపోవచ్చని తెలుస్తుంది. చివరి నిమిషంలో ఏదైనా వారి వారి ప్లాన్స్ మారితే తప్ప… ఆల్ మోస్ట్ కష్టం అని అంటున్నారు!

ఇది ఒక రకంగా చంద్రబాబుకు సంతోషం కలిగించే అంశమనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. కారణం… నందమూరి ఫ్యామిలీకి సంబంధించి, టీడీపీకి సంబంధించి ఎంతమంది వేదికపైఉన్నా… జూనియర్ ఎన్టీఆర్ వస్తే వారంతా ఫోకస్ లో ఉండరు అనే మాటలు తరుచుగా వినిపిస్తుండటం.

అయితే… మిగిలిన వారిలో… సీఎం జ‌గ‌న్‌ తో స‌న్నిహితంగా ఉంటార‌నే కార‌ణంతో చిరంజీవిని పిలవలేదనే కామెంట్లు వినిపిస్తుండగా… మోహన్ బాబును ఆహ్వానిస్తే మాత్రం ఆవేశంలో ఎక్కడ నిజాలు మాట్లాడేస్తారో అనే భ‌యంతోనే ఉద్దేశ పూర్వకంగానే పక్కన పెట్టారని తెలుస్తుంది. మోహన్ బాబు మైక్ అందుకుంటే ఇటు చంద్రబాబును పరోక్షంగా ఉతికి ఆరేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఫలితంగా ఆయన్ని పిలవడానికి చంద్రబాబు అనుమతి ఇవ్వలేదని తెలుస్తుంది.