ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వేరే వేరే పార్టీల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం ఇప్పుడు ఆయన అల్లుడు చంద్రబాబు చేతిలో ఉండగా.. ఆయన కుమార్తె పురందేశ్వరి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఈ క్రమంలో అన్నగారి ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఒకే చోట కలవబోతున్నారు.
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. త్వరలో రాష్ట్రపతిభవన్ లో ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని వంద రూపాయల నాణాన్ని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని కేంద్రం గ్రాండ్ లెవెల్ లో నిర్వహిస్తోంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యామిలీతో పాటు ఆయనతో సన్నిహితంగా ఉన్న వారిని కలుపుకుని మొత్తం వంద మంది దాకా ఈ వేడుకకు ఆహ్వానించారు అని తెలుస్తోంది.
దీంతో ఢిల్లీ వేదికగా ఎన్టీఆర్ కుటుంబం అంతా కలవనుంది అని అంటున్నారు. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్, నందమూరి బాలకృష్ణ ఇతర ఫ్యామిలీ మెంబర్స్ అంతా వస్తారని చెబుతున్నారు. ఎన్నికల సమయం కావడంతో… చంద్రబాబు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
అయితే ఈ కార్యక్రమానికి అసలు రావాల్సిన వ్యక్తి… ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి అని అంటున్నారు అన్నగారి అభిమానులు. కుటుంబ సభ్యులు అంటే… భార్య తర్వాతే పిల్లలైనా, వారి పిల్లలైనా అని చెబుతున్నారు. ఆఖరికి అల్లుల్లు సైతం ముందువరుసలో నిలబడటానికి రెడీ అయిపోతోన్న వేళ… భార్యకు ఆహ్వానం అందిందా లేదా అనేది ఆసక్తిగా మారింది.
ఏది ఏమైనా… ఎన్టీఆర్ బొమ్మతో ముద్రించిన 100 రూపాయల నాణం విడుదల కార్యక్రమానికి ఆయన శ్రీమతి లక్ష్మీపార్వతి హాజరవ్వాలని కోరుకుంటున్నారు. కేంద్రంలోని పెద్దలు అన్నగారి భార్యకు విలువ ఇవ్వాలని అంటున్నారు. అయితే… మోడీ అందుకు అంగీకరిస్తారా.. ఆ వేదికపై అన్నగారి “భార్య” ఉండటానికి ఒప్పుకుంటారా అన్నది వేచి చూడాలి!