సంచలనం: బాలయ్యకు టిక్కెట్టు లేదని చెప్పేసిన చంద్రబాబు

చంద్రబాబునాయుడు బావమరది, హిందుపురం ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణకు ఫెయిల్ మార్కులు వచ్చాయట. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు దక్కనట్లే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంఎల్ఏల పనితీరుపైన, వారిపై జనాభిప్రాయం విషయంలో చంద్రబాబు ప్రతీనెల సర్వేలు జరిపించుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే.  అన్నీ నియోజకవర్గాలతో పాటు హిందుపురం నియోజకవర్గంలో కూడా సర్వే చేయిస్తున్నారు. అయితే, ఏ సర్వేలో కూడా బాలకృష్ణకు పాస్ మార్కులు కూడా రాలేదట. దాంతో బాలయ్యను చంద్రబాబు పలిపించుకుని సర్వే నివేదికలు చూపించారని సమాచారం.

రానున్న ఎన్నికల్లో తెలుగుదేదశంపార్టీకి ఎంత అవసరమో వివరించి జనాల్లో మంచిపేరు లేని నేతలకు టిక్కెట్లివ్వటం వల్ల వచ్చే నష్టమేమిటో చెప్పేశారట. అంటే వచ్చే ఎన్నికల్లో హిందుపురంలో బాలకృష్ణకు టిక్కెట్టివ్వటం సాధ్యం కాదని  చెప్పేశారు. నిజానికి హిందుపురంలో గిలిచన దగ్గర నుండి బాలకృష్ణ నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకున్నది లేదు. మొత్తం వ్యవహారాలన్నీ పిఏ శేఖర్ పైనే వదిలేశారు. దాంతో ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా కూడా పిఏ పెత్తనమే పెరిగిపోయింది.

అసలు హిందుపురం ఎంఎల్ఏ ఎవరంటే తానే అన్నట్లుగా పిఏ వ్యవహరించటం మొదలుపెట్టారు. ఒకవైపు బాలకృష్ణ నియోజకవర్గాన్ని పిఏకి రాసిచ్చేయటం, పిఏ యేమో నియోజకవర్గంలోని నేతలను, అధికారులను ఎవరినీ లెక్కచేయకపోవటంతో మొత్తం వ్యవహారమంతా బాగా కంపైపోయింది.  దానికితోడు ప్రతీ పనికి పిఏ వసూళ్ళకు తెగబడుతుండడటంతో బాలకృష్ణ మీద జనాల్లోను, పార్టీలోను తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది.  దాంతో బాలయ్యపై నియోజకవర్గంలో తిరుగుబాటు మొదలైంది. అప్పుడు తప్పదని పిఏని మార్చారు. అయితే అప్పటికే పార్టీ, బాలకృష్ణ జనాల్లో, పార్టీలో గబ్బుపట్టేశారు.

అప్పటి నుండి చంద్రబాబు చేయించుకుంటున్న ప్రతి సర్వేలో కూడా బాలకృష్ణకు మైనస్ మార్కులే వస్తున్నాయట. దాంతో బాలకృష్ణను ఇక్కడి నుండి పోటీ చేయిస్తే ఓడిపోవటం ఖాయమని తేలిపోయింది. అదే విషయాన్ని బాలకృష్ణకు చంద్రబాబు స్పష్టం చేశారట. మరి వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ ఏం చేస్తారనేది సస్పెన్సుగా మారింది. అదే సమయంలో హిందుపురంలో చంద్రబాబు కానీ లేదా లోకేష్ కానీ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే, జిల్లాలోని నేతలతో సమావేశం సందర్భంగా చంద్రబాబు మాట్లాడినపుడు స్ధానికులైతేనే బాగుంటుందని మెజారిటీ నేతలు చెప్పారట. దాంతో హిందుపురంలో ఎవరు పోటీ చేసేది ఇంకా నిర్ణయం కాలేదు.