ముందస్తు లేదా.? పవన్ కళ్యాణ్ సినిమాల వైపేనా.?

ఆంధ్రప్రదేవ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదట. అలాగని జనసేన శ్రేణులకి ఓ స్పష్టత వచ్చేసిందట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలోనే ఆయనకు బీజేపీ అధినాయకత్వం ఈ విషయాన్ని చెప్పిందట.

గత కొంతకాలంగా ఏపీలో ముందస్తు ఎన్నికలంటూ ప్రచారం జరుగుతోంది. ఆ ఛాన్సే లేదని వైసీపీ చెబుతున్నా, జనసేన అలాగే టీడీపీ.. ముందస్తు ఎన్నికలపై తెగ ఉత్సాహపడిపోతున్నాయ్. టీడీపీ కంటే ఎక్కువగా జనసేన కంగారు పడింది. వారాహి విజయ యాత్ర షురూ అయ్యింది కూడా ముందస్తు అంచనాలతోనే.

ఇప్పుడేమో, ముందస్తుకు అవకాశం లేదని పవన్ కళ్యాణ్‌కి మిత్రపక్షం బీజేపీ చెప్పేసిందంటూ ప్రచారం జరుగుతోందాయె. అదే నిజమైతే, పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లో బిజీ అయిపోవాల్సిందే. మరి, వారాహి విజయ యాత్ర సంగతేంటి.? ప్చ్.. అదంతే.! వారాహి విజయ యాత్ర కారణంగా పార్టీలో చేరికలు పెరిగిన మాట వాస్తవం.. ఈ నేపథ్యంలోనే జనసేన శ్రేణులు కొంత ఉత్సాహంగా వున్నారు. ముందస్తు ప్రచారం ఉత్తదేనని తేలిపోతే, జనసేన శ్రేణులూ నీరసించిపోతాయ్.

అబ్బే, అదేం లేదు.. జనంలోనే పవన్ వుంటారు.. అంటే, అంత ఓపిక ఆయనకు వుంటుందా.? అన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్. చేరికలు పెరుగుతున్న దరిమిలా.. ఈ ఊపు కొనసాగాలంటే ముందస్తు ఎన్నికలు రావాలి. లేకపోతే, చేరికలు చల్లారిపోయి.. బయటకు వెళ్ళిపోయేవాళ్ళ సంఖ్య పెరిగిపోవచ్చు.! పెద్ద సంకటమే వచ్చి పడింది జనసేన అధినేతకి.!