సినిమాలొద్దు.. రాజకీయాలే బెటర్ మెగాస్టారూ.!

ఒక్కటే కదా సినిమా ఫ్లాప్ అయ్యింది.! ఇంతలోనే, సినిమాలొద్దు.. రాజకీయాల్లోకి చిరంజీవి వెళ్ళిపోవడమే బెటర్.. అనే చర్చ ఎందుకు జరుగుతోంది.? నిజానికి, చిరంజీవి చేతిలో ఇప్పటికిప్పుడు రెండు సినిమాలున్నాయ్. చిరంజీవి రెమ్యునరేషన్ కూడా తక్కువేం కాదు.. 65 కోట్లు, ‘భోళా శంకర్’ సినిమా కోసం తీసుకున్నాడాయన.

‘భోళా శంకర్’ దెబ్బ కొట్టినా, తదుపరి సినిమాకి రెమ్యునరేషన్ 70 కోట్లు.. అంతకు మించి అవుతుంది తప్ప, తగ్గదు. సినిమాల రిజల్టుతో సంబంధం లేదు, మెగాస్టార్ స్టార్‌డమ్‌కి. ఆయన లెక్కే వేరు.! ఎవరో సోషల్ మీడియాలో కూర్చుని కూతలు కూసినట్టుండదు వ్యవహారం. నిర్మాతలకు తెలుసు, చిరంజీవితో సినిమా స్టార్ట్ చేస్తే.. తమ రేంజ్ ఎలా పెరుగుతుందో.!

‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి వచ్చిన లాభాలు, చిరంజీవి స్టామినా ఏంటో చెబుతాయ్. ‘భోళాశంకర్’ నష్టాలు కూడా, జస్ట్ సోషల్ మీడియాలో కనిపించడం మాత్రమే. నిర్మాతకి వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఆయన ముందుగానే.. చాలా గట్టిగానే, జేబులో వేసుకున్నాడు ‘భోళా శంకర్’ సినిమాతో.

ఈక్వేషన్ ఇంత స్పష్టంగా వుంటే, సినిమాల్ని కాదనుకుని చిరంజీవి ఎందుకు రాజకీయాల్లోకి మళ్ళీ వెళతారు.? రాజకీయం అంటేనే, ఛండాలం.! అందులోకి దిగాక, బురదని అంటించుకోవాల్సిందే. అది వద్దనుకునే, రాజకీయాలు వదిలేసి, సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి.

కానీ, సినిమాల్లోనూ రాజకీయాలకు మించిన ఛండాలం తయారయ్యింది ట్రోలింగ్ రూపంలో. సో, ఆ ఛండాలం తప్పనప్పుడు.. సినిమాల్ని, రాజకీయాల్ని బ్యాలెన్స్ చేసుకుంటే పోలా.? అని కొందరు చిరంజీవికి, సలహాలు ఇస్తున్నారట.! ఏమో, చిరంజీవి మనసు మారుతుందేమో.!