ఈ రోజు రేషన్ వాహనాలను తనిఖీ చేయనున్న నిమ్మగడ్డ !

nimmagadda ramesh kumar

ఏపీ పంచాయతీ ఎన్నికలపై ఇప్పటికే ఎన్ఈసీ, ప్రభుత్వానికి మధ్య వార్ ఓరేంజ్ లో జరుగుతుంది. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈనేపధ్యంలో రెండురోజుల క్రితం ప్రభుత్వం పట్టణాల్లో ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం చేపట్టింది.. దీనిపై ఎన్ఈసీ హైకోర్టును ఆశ్రయించింది.

Nimmagadda Ramesh Kumar
Nimmagadda Ramesh Kumar

విచారణ చేపట్టిన హైకోర్టు కీలకాదేశాలను జారీ చేసింది. దీంతో నేడు రేషన్ వాహనాలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనిఖీ చేయనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్ఈసీ కార్యాలయానికి రేషన్ వాహనాలు రానున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే ఎన్ఈసీతో ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఆయితే అర్బన్ ఏరియాల్లో ఎన్నికలు లేన్నందున రేషన్ పంపిణీపై సమస్య లేదని ప్రభుత్వం అంటుంది. అయితే రేషన్ పంపిణీ వాహనాలపై సీఎం జగన్ ఫోటో ఉన్నందున ఇది సరికాదని ఎన్నికల కమిషన్ తెలిపింది. మిగతా ఏరియాల్లో రేషన్ పంపిణీ పై దిశానిర్ధేశం చేయనుంది హైకోర్టు.