గవర్నర్ తో భేటీ కానున్న నిమ్మగడ్డ.. ఆ వ్యవహారమే కారణమా ?

Big Twist: High Court breaks SEC lemongrass speed

నేడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ ని కలవనున్నారు. ఆయన కలవడానికి పెద్ద కారణమే ఉందని అంటున్నారు. ముఖ్యంగా గుంటూరు చిత్తూరు, కలెక్టర్ ల వ్యవహారం మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ రెండు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేయాలని గతంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పుడు అమలు చేయకపోవడంతో ఆ విషయం మీద ఎన్నికల కమిషనర్ సీరియస్ గా ఉన్నారు అని అంటున్నారు. అందుకే ఈ రెండు జిల్లాల కలెక్టర్లతో కాకుండా ఆ రెండు జిల్లాలకు ఉన్న జాయింట్ కలెక్టర్లతో ఇప్పటి వరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చర్చిస్తూ వస్తున్నారు.

ఇక ఇప్పుడు ఎన్నికలు దగ్గరికి వచ్చేసరికి ఈ కలెక్టర్లను బదిలీ చేయాలా వద్దా, అనే దానిపై చర్చ జరుగుతోంది ఇదే విషయాన్ని మరో సారి ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈరోజు గవర్నర్ దృష్టికి కూడా ఎన్నికల కమిషనర్ ఇదే అంశాన్ని తీసుకువెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులతో ఎస్ఈసీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ కానున్నారు. లోకల్ ఎలక్షన్స్ గురించి అధికారులతో చర్చించనున్నారు. ఇదివరకు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఎలక్షన్స్ ఉంటాయని నిమ్మగడ్డ ప్రకటించారు.