ప్రజా సమస్యలు పట్టించుకోని నాయకుల కు చెక్
◆డిసెంబర్ 4 న తాడేపల్లి రమ్మన్న జగన్.
◆టార్గెట్ 175 దిశగా జగన్ నిర్ణయాలు.
◆గడప గడప కు ప్రభుత్వం ప్రామాణికం.
◆ఐ ప్యాక్ నివేదిక పై వర్క్ షాప్.
◆సిట్టింగ్ లను సైతం మార్చడానికి సిద్ధమైన జగన్.
◆కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం.
వచ్చే సార్వత్రిక ఎన్నికలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారిన నేపథ్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీపరంగా పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోన్నారు. అభ్యర్ధుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోన్నారు. 175 నియోజకవర్గాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నందున అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయన రాజీపడట్లేదు. ఇందులో భాగంగా తరచూ వర్క్‌షాప్‌లను నిర్వహిస్తోన్నారు.
గడప గడపకూ మన ప్రభుత్వం..
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ చేపట్టిన గడప గడపకూ మన ప్రభుత్వం ద్వారా ప్రజల నుంచి నేరుగా అందే ఫీడ్‌బ్యాక్‌ను వైఎస్ జగన్ దీనికి ప్రాతిపదికగా తీసుకుంటోన్నారు. ఎమ్మెల్యేల పనితీరును బేరీజు వేయడానికి, పరిపాలన- సంక్షేమ పథకాల అమలుపై ప్రజాభిప్రాయాలను సేకరించడానికి గడప గడపకూ మన ప్రభుత్వం ఉపయోగపడుతోంది. భవిష్యత