రెండు పడవల ప్రయాణం.. ఆ తప్పు చేస్తే చంద్రబాబుకు కష్టాలు తప్పవా?

chandrababu-naidu-reuters-1139326-1661445251

2019 ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు పథకాలను అమలు చేసినా ఆ డబ్బులను తీసుకున్న మహిళలు చంద్రబాబుకు భారీ షాకిచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా టీడీపీ పోటీ చేయనుందని ఇప్పటికే క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే రెండు పడవల ప్రయాణం వల్ల చంద్రబాబుకు మరిన్ని కష్టాలు తప్పవని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఏపీలోని అన్ని అసెంబ్లీ స్థానాలలో బీ.ఆర్.ఎస్ పార్టీ పోటీ చేయనుందని సమాచారం. బీ.ఆర్.ఎస్ రాష్ట్రంలో పోటీ చేసినా ఆ పోటీ వల్ల వైసీపీకి కొత్తగా వచ్చిన నష్టం అయితే లేదు. అయితే ఈ పోటీ చంద్రబాబుకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

గత ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం వల్ల టీడీపీ ఊహించని స్థాయిలో నష్టపోయిందనే తెలిసిందే. బీ.ఆర్.ఎస్ వల్ల అదే పరిస్థితి ఎదురవుతుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. బీ.ఆర్.ఎస్ పార్టీ పోటీ వెనుక జగన్ ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఏపీ అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఏ పార్టీ గెలుస్తుందో చూడాల్సి ఉంది.

కేసీఆర్ కు, చంద్రబాబుకు మధ్య సత్సంబంధాలు లేవు. చంద్రబాబును నమ్మి మోసపోయిన రాజకీయ నేతలలో కేసీఆర్ కూడా ఒకరు. అందువల్ల చంద్రబాబును కేసీఆర్ నమ్మే ఛాన్స్ లేదు. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చనివ్వనని చాలా సందర్భాల్లో చెబుతున్న పవన్ బీ.ఆర్.ఎస్ విషయంలో ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది.