ఊస‌ర‌వెల్లి వ్యాఖ్య‌ల్లో త‌ప్పేముంది.. మెగా బ్ర‌ద‌ర్‌ని వాయిస్తున్నారుగా..!

వివ‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వర్గాల్లో దుమారం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల బ‌రిలో దిగుతామ‌ని చెప్పిన ప‌వ‌న్ క‌ళ్యాణ్, చివ‌రి నిముషంలో మాట‌మార్చి బీజేపీకి మ‌ద్ద‌తు తెలిపి త‌న‌ప‌రువు తానే తీసుకున్నాడు. తన మాట‌లు తానే తుంగ‌లో తొక్కి ప‌వ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో జన‌సేన నేత‌లే డిజ‌ప్పాయింట్ అయిన సంగ‌తి తెలిసిందే.

Nagababu

ఈ క్ర‌మంలో తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో భాగంగా ప్ర‌కాష్ రాజ్ రాజ‌కీయాల్లో ప‌వ‌న్ తీరు పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు సంధించారు. లీడర్‌గా పార్టీ పెట్టి వ‌రుస‌బెట్టి ఇత‌ర పార్టీల‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ఏంటో త‌న‌కు అర్ధం కావ‌డంలేద‌ని ప్ర‌కాష్ సెటైర్స్ వేశాడు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్, ఆ త‌ర్వాత‌ బీజేపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి జ‌న‌సేన పార్టీలో ఉన్న నాయ‌కుల‌కు, క్యాడ‌ర్‌కు ఎలాంటి సంకేతం ఇచ్చార‌ని ప్ర‌కాష్ రాజ్ ప్ర‌శ్నించారు.

ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో ప‌వ‌న్ తీరు చూస్తుంటే.. ఊస‌ర‌వెల్లిలా రంగులు మారుస్తున్నాడ‌ని తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డాడు. ఒక లీడ‌ర్ అయిన ప‌వ‌న్ మ‌రో నాయ‌కుడిని బ‌ల‌ప‌ర్చ‌డం త‌న‌కు న‌చ్చ‌లేద‌ని తేల్చి చెప్పాడు ప్ర‌కాష్. దీంతో వెంట‌నే భుజాలు త‌డుముకున్న మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు రంగంలోకి దిగి ప్ర‌కాష్ రాజ్ పై కామెంట్స్ చేశారు. ఈ క్ర‌మంలో ప్ర‌కాష్ రాజ్ గుట్టు ఇదేనంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద లెట‌ర్ పోస్ట్ చేశాడు.

దీంతో ఆ లెట‌ర్‌లో నాగ‌బాబు చెప్పిన పాయింట్లు ప‌ట్టుకుని సోష‌ల్ మీడియాలో ఆయ‌న పై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డుతున్నారు. ప్ర‌కాష్ రాజ్ వ్యాఖ్య‌ల్లో త‌ప్పేముందంటూ పవ‌న్ రంగులు బ‌య‌ట‌పెడుతున్నారు. ఈ క్ర‌మంలో 2014లో ఎన్‌డిఏ అండ్ టీడీపీల‌కు మద్దతిచ్చిన ఈ జ‌న‌సేనాని, అస‌లు పోటీ చేయకుండా ప్రచారం చేసిన సంగ‌తి తెలిసిందే‌. ఇక ఆ త‌ర్వాతో బీజేపీతో క‌టీఫ్ అయ్యి, టీడీపీతో మాత్రం ర‌హ‌స్యంగా దోస్తీ చేస్తూ.. క‌రెక్ట్‌గా ఎన్నిక‌ల ముందు లెఫ్ట్ పార్టీలతో జతకట్టి ఘోరంగా ఓట‌మిపాలైన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌ళ్ళీ బీజేపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం చూస్తుంటే ప‌వ‌న్‌ని రంగులు మార్చే ఊస‌ర‌వెల్లి అన‌క ఏమంటారు అని సోష‌ల్ మీడియ‌లో బ్ర‌దర్ నాగ‌బాబును వాయిస్తున్నారు.