ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రోడ్ల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఏపీలోని కొన్ని ప్రాంతాలలో రోడ్లు బాగానే ఉన్నా మరికొన్ని ప్రాంతాలలో మాత్రం రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. కొన్నిరోజుల క్రితం జగన్ ఒక సందర్భంలో జులై 15 నాటికి రోడ్లను బాగు చేయాలని ఆదేశించారు. జులై 15 నాటికి రహదారులపై ఉన్న గుంతలను పూడ్చాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ నెల 20వ తేదీ నాటికి రోడ్ల ఫోటోలకు సంబంధించిన గ్యాలరీలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచనలు చేశారు. మూడేళ్లలోనే రోడ్ల కోసం 2400 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని జగన్ అన్నారు. అయితే జులై 15వ తేదీ వచ్చినా ఏపీలోని రోడ్ల పరిస్థితి ఏ మాత్రం మారలేదు. వాహనాలలో తరచూ ప్రయాణించే ప్రయాణికులు సరైన రోడ్లు లేకపోవడం వల్ల పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.
ప్రతిపక్షాలు సైతం ఏపీలోని రోడ్ల విషయంలో వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. సరైన రోడ్లు లేకపోవడం వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా బస్సులలో స్కూళ్లకు ప్రయాణించే విద్యార్థులు గతుకుల రోడ్ల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం రోడ్ల కోసం వేల కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నా వాస్తవ పరిస్థితి మరో విధంగా ఉంది.
ఆ డబ్బు ఏమైంది జగన్ అంటూ నెటిజన్ల నుంచి ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. జగన్ సర్కార్ జులై 15వ తేదీని డెడ్ లైన్ గా ప్రకటించినా అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. జగన్ సర్కార్ రోడ్లపై దృష్టి పెట్టి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తే మాత్రమే ఈ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. జగన్ సర్కార్ ఈ దిశగా అడుగులు వేస్తుందో లేదో చూడాల్సి ఉంది.