రివ్యూ : నేను మీకు బాగా కావాల్సిన వాడిని

nenu meeku baga kavalsina vadini review

 

రివ్యూ : నేను మీకు బాగా కావాల్సిన వాడిని

నటీనటులు: కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్ మరియు సోనూ ఠాకూర్, ఎస్ వి కృష్ణా రెడ్డి, బాబా భాస్కర్

 

దర్శకుడు: శ్రీధర్ గాధే

నిర్మాత: కోడి దివ్య దీప్తి

సంగీత దర్శకుడు: మణి శర్మ

సినిమాటోగ్రఫీ: రాజ్ నల్లి

ఎడిటర్: ప్రవీణ్ పూడి

 

కిరణ్ అబ్బవరం – సంజన ఆనంద్ జంటగా వచ్చిన సినిమా “నేను మీకు బాగా కావాల్సిన వాడిని”. శ్రీధర్ గాధే డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ చూద్దాం.

 

కథ :

వివేక్ (కిరణ్ అబ్బవరం) ఒక క్యాబ్ డ్రైవర్. తేజు (సంజన ఆనంద్) ఒక సాప్ట్ వేర్ ఎంప్లాయ్. ఈ ఇద్దరు మధ్య జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఒకరి గతం ఒకరు తెలుసుకుంటారు. తేజు లవ్ ఫెయిల్యూర్ తో పూర్తిగా మద్యానికి అలవాటు పడుతుంది. ఆమె ప్రేమ కథ విని వివేక్ ఆమెకు ఎలాంటి సహాయం చేశాడు ?, అసలు వివేక్ ఎవరు ?, పవన్ అయ్యి ఉండి వివేక్ గా ఎలా మారాడు ?, ఎందుకు మారాడు?, ఇంతకీ అతను తేజు జీవితంలోకి ఎందుకు వచ్చాడు ? చివరకు ఈ ఇద్దరు కలిసారా ? లేదా ? అనేది మిగిలిన కథ.

 

విశ్లేషణ :

కిరణ్ అబ్బవరం – సంజన ఆనంద్ ఇద్దరు తమ పాత్రలకు ప్రాణం పోశారు. లవ్ సీన్స్ నుంచి ఎమోషనల్ సన్నివేశాల వరకూ ఇద్దరు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తమ పాత్రలతో మెప్పించారు. మెయిన్ గా క్లైమాక్స్ లో కిరణ్ అబ్బవరం నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కీలక పాత్రలో నటించిన ఎస్ వి కృష్ణా రెడ్డి కూడా చాలా బాగా నటించాడు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో కనిపించిన సోనూ ఠాకూర్ కూడా అద్భుతంగా నటించింది. కానీ ఆమెది చాలా చిన్న క్యారెక్టర్.

ఇక బాబా భాస్కర్ తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్స్… ఈ కథ జరిగిన నేపథ్యం బాగున్నా… సహజంగా పాత్రలు సాగవు. సినిమా చూస్తున్నంత సేపు గతంలో ఎక్కడో ఈ సీన్స్ చూశాం కదా అనే భావన కలుగుతుంది. అలాగే డైరెక్టర్ శ్రీదర్ గాదే రాసుకున్న సున్నితమైన భావోద్వేగాలు కొన్ని చోట్ల బోర్ గా సాగాయి.

ఓవరాల్ గా ఈ నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాలో మ్యాటర్ లేదు. వెరీ రెగ్యులర్ ప్లే, ఫేక్ ఎమోషన్స్, లాజిక్ లేని ల్యాగ్ సీన్స్ అండ్ రొటీన్ సీన్స్.. మొత్తంగా ఈ సినిమా బోర్ కొడుతుంది. కిరణ్ అబ్బవరం కెరీర్ కి ఇది పెద్ద బ్రేక్ అయింది. దర్శకుడు శ్రీదర్ బలమైన స్క్రిప్ట్ రాసుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.

 

nenu meeku baga kavalsina vadini review
nenu meeku baga kavalsina vadini review

ప్లస్ పాయింట్స్ :

కిరణ్ అబ్బవరం నటన,

మెయిన్ పాయింట్,

మిగిలిన నటీనటుల నటన,

 

మైనస్ పాయింట్స్ :

స్లో నేరేషన్,

రెగ్యులర్ స్క్రీన్ ప్లే,

బోరింగ్ డ్రామా,

రొటీన్ సీన్స్,

అండ్ ఫేక్ ఎమోషన్స్

 

తీర్పు :

‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’.. ఎవరికి అక్కర్లేకుండా పోయింది. కాకపోతే, కిరణ్ అబ్బవరం నటన బాగుంది. కానీ, బోరింగ్ ప్లే, సిల్లీగా సాగే లవ్ స్టోరీ, ఇక కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగడం వంటి పాయింట్స్.. ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమా బాగాలేదు.

రేటింగ్ : 2 / 5