పవన్ హాఫ్ నాలెడ్జ్ మాటలు… నాజర్ స్మూత్ & స్ట్రాంగ్ కౌంటర్!

పవన్ ఏ విషయం గురించి అయినా పూర్తిగా తెలుసుకోకుండానే మాట్లాడుతుంటారని అంటుంటారు వైసీపీ నేతలు, పరిశీలకులు. గాలి వార్తలకు సాల్ట్ & పెప్పర్ జోడించి వేదికలపై మైకుపట్టుకుని మాట్లాడేస్తుంటారు. సంచలనాల కోసం మాట్లాడతారో.. లేక, తాను మాత్రమే మాట్లాడగలలనే ఆలోచనతో మాట్లాడతారో తెలియదు కానీ… పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడేస్తుంటారు!

ఈ సందర్భంగా తాజాగా తమిళ సినిమా ఇండస్ట్రీపై కామెంట్ చేశారు పవన్ కల్యాణ్. అవును… హైదరాబాద్‌ లో జరిగిన “బ్రో” సినిమా ప్రీ రిలీజ్‌ కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ తమిళ చిత్ర పరిశ్రమపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా… తెలుగు సినిమా ఇండస్ట్రీని చూసి కోలీవుడ్‌ పరిశ్రమ చాలా నేర్చుకోవాలని ఆయన కామెంట్‌ చేశారు!

తమిళ పరిశ్రమలో తమిళులు మాత్రమే నటించాలనే ధోరణి నుంచి బయటకు రావాలని అక్కడి పరిశ్రమ పెద్దలకు పవన్ తాజాగా సూచించారు. నేడు తెలుగు చిత్ర పరిశ్రమ అందరికీ అన్నం పెడుతుందని.. అలాగా అందరినీ అక్కున చేర్చుకుంటుందని చెప్పిన పవన్‌.. తమిళ చిత్ర పరిశ్రమలో కూడా మార్పు రావాలని సూచించారు. ఇతర భాషలకు చెందిన నటులను కూడా కోలీవుడ్‌ లో తీసుకోవాలని ఆయన తెలిపారు.

అయితే పవన్ వ్యాఖ్యలపై తమిళ సినిమా ఇండస్ట్రీ స్పందించింది. ఇందులో భాగంగా.. నడిగర్ సంఘం అధ్యక్షుడు, ప్రముఖ నటులు నాజర్… పవన్ వ్య్యాఖ్యలను ఖండించారు. “తమిళ చిత్ర పరిశ్రమలో ఇతర భాషలకు చెందిన వారు పని చేయకూడదనే రూల్స్ పెట్టారనే ప్రచారం జరుగుతోంది.. అలాంటి నిబంధన తీసుకు వస్తే ముందు నేనే దాన్ని వ్యతిరేకిస్తాను.. దీన్ని ఎవరో కావాలనే తప్పుగా ప్రచారం చేస్తున్నారు” అని అన్నారు.

విషయం పూర్తిగా తెలుసుకోకుండా పవన్ కల్యాణ్‌ కూడా ఇదే విషయాన్ని స్టేజ్ మీద చెప్పారు అని పరోక్షంగా అభిప్రాయపడిన ఆయన… పవన్ కు ఎవరో తప్పుడు సమాచారాన్ని అందించి ఉంటారని అభిప్రాయపడ్డారు. తమిళ సినీ కార్మికుల రక్షణ కోసం సెల్వమణి కొన్ని సూచ‌న‌లు చేశారని.. అందులో భాగంగా ఇచ్చిన ఒక సూచనను కొంతమంది సరిగా అర్ధం చేసుకోలేదని తెలిపారు.

“తమిళ సినిమా పరిధిలో మాత్రమే మూవీ చేస్తున్నప్పుడు ఇక్కడి టెక్నీషియన్లను మాత్రమే కొంత వరకు ఎంకరేజ్‌ చేయండి అని సెల్వమణి సూచించారు.. తమిళ సినీ కార్మికుల రక్షణ కోసం సెల్వమణి ఈ సూచన చేశారు.. అంతే కానీ ఇతర భాషల నటులను వద్దని ఎవ్వరూ చెప్పలేదు..” అని నాజర్ క్లారిటీ ఇచ్చారు.

దీంతో… ఏ విషయాన్ని అయినా పూర్తిగా తెలుసుకోకుండా పవన్ కల్యాణ్ ఇలా ఎందుకు హాఫ్ హాఫ్ తెలుసుకుని మాట్లాడతారు అని పలువురు ఫ్యాన్స్ ఫీలవుతున్నారని తెలుస్తుంది. దీనివల్ల పవన్ కు అన్ని విషయాల్లోనూ హాఫ్ నాలెజ్డ్ అనుకుంటున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు.

కాగా… ఏపీలో మహిళలు అదృశ్యమవుతున్నారన్న విషయంలో కూడా పవన్ ఇలా హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడారని.. ఫలితంగా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని.. ఇప్పుడు ఎంత లాక్కుని పీకున్నా ప్రయోజనం కలగడం లేదని వాపోతున్నారంట!