విజయసాయిరెడ్డి పంచ్: తెగ బలిసిన కోడి. డాష్ డాష్.!

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోతున్నారు. పొలిటికల్ మిర్చి అంటున్నారు.. నాక్ ఔట్ పంచ్ అంటున్నారు.. ఇంకేవేవో పేర్లతో రాజకీయ ప్రత్యర్థులపై సెటైర్లు వేసేస్తున్నారు విజయసాయిరెడ్డి.

తాజాగా విజయసాయిరెడ్డి సెటైర్ల లిస్టులోకి చేరిపోయారు సీపీఐ నేత నారాయణ. నారాయణ అనగానే, ‘చికెన్’ గుర్తుకొస్తుంటుంది. ఆయనకు చికెన్ కర్రీ విత్ ఇడ్లీ చాలా ఇష్టం. ఎవరి ఇష్టం వాళ్ళది. అయినా, ఫలానా ఆహారం ఫలానా వ్యక్తికి ఇష్టమైనంతమాత్రాన, ఆ పేరుతో వెటకారం చేయడమేనా.

‘దమ్ముంటే ఎన్నికలు పెట్టండి..’ అంటూ సీపీఐ నేత నారాయణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సవాల్ విసిరేశారు. సరే, రాజకీయాల్లో సవాళ్ళు, ప్రతి సవాళ్ళు మామూలే.

ప్రత్యేక హోదా తెస్తామన్నారు.. తేలేకపోయారంటూ సీపీఐ నేత నారాయణ గుస్సా అయ్యారు. ఎందుకు ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారో సమాధానం చెప్పాల్సిన విజయసాయిరెడ్డి, ‘హాయిగా చికెన్ తింటూ ఎంజా్ చెయ్యక మీకెందుకు నారాయణగారూ సవాళ్ళు? ఆంధ్రాలో ఎక్కడా మీరు వార్డు మెంబర్‌గా కూడా గెలవలేరు. తెగ బలిసిన కోడి చికెన్ షాప్ ముందు నిలబడి తొడగొట్టినట్లుంది మీ సవాళ్ళ సంబరం..’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీటేశారు.

కానీ, గతంలో వైసీపీ అధినేత తండ్రి, అప్పటి కాంగ్రెస్ నేత రాజశేఖర్ రెడ్డి, ఇదే నారాయణ సాయం తీసుకున్నారు.. ముఖ్యమంత్రి అయ్యే క్రమంలో. ఆ విషయాన్ని విజయసాయిరెడ్డి విస్మరిస్తే ఎలా.? నారాయణ వార్డు మెంబరుగా గెలవగలరో లేదో.! ఆ విషయం పక్కన పెడితే, విజయసాయిరెడ్డి గెలవగలరా.? అని కౌంటర్ ఎటాక్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయ్.. అదీ ఆయన ట్విట్టర్ హ్యాండిల్‌లోనే.