Nara Lokesh: తెలుగుదేశం పార్టీ యువ నేత, ఐటీ పరిశ్రమల, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటన చేశారు. ఇటీవల కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ తండ్రి మరణించడంతో మంత్రి శ్రీనివాస్ వర్మను పరామర్శించడం కోసం నారా లోకేష్ ఆయన ఇంటికి వెళ్లారు. ఇలా మంత్రి శ్రీనివాస్ వర్మను ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన నారా లోకేష్ అక్కడి పార్టీ కార్యకర్తలతో నాయకులతో కీలక సమావేశంలో పాల్గొన్నారు..
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.ప్రతీ నెల నాలుగు వేల కోట్ల రూపాయిల లోటుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడుస్తోందన్నారు. రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా తమ ప్రభుత్వం పాలన సాగిస్తుందని చెప్పారు. గత సైకో జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం పూర్తిగా వెనక్కి పడిపోయిందని ఒక్కసారిగా 100 సంవత్సరాల వెనక్కి రాష్ట్రం వెళ్లిపోయిందని లోకేష్ తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ.. దేశాభివృద్ధి కోసం పాటుపడుతోన్నారని పేర్కొన్నారు. మీ సమస్యలు ఏమైనా ఉంటే తనకు చెప్పాలని ఈ విషయాన్ని కూటమి పార్టీ అధినేతల వరకు తీసుకెళ్లి పరిష్కారం చేస్తామే తప్ప విడాకులు తీసుకొని విడిపోవడం లాంటివి ఉండకూడదని తెలిపారు.. ఎలాంటి సమస్యలు ఉన్న పరిష్కరించుకొని కూటమి పార్టీల పొత్తును కొనసాగించాలని తెలిపారు.
ఇకపై కూటమిలో మిస్ ఫైర్, క్రాస్ ఫైర్, విడాకులు వంటివి ఉండవని మంత్రి లోకేష్ తెలిపారు. కూటమి పార్టీలను విడిదీసే పనిలో సైకో జగన్ రెడ్డి అతని బ్యాచ్ ఉన్నారని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొనీ బూత్ లెవెల్ నుంచి జాతీయ స్థాయి వరకూ మనమందరం అప్రమత్తంగా ఉండాలనీ ఈయన కూటమి పార్టీ నేతలు కార్యకర్తలకు తీశానిర్దేశాలు చేశారు.