Nara Lokesh: ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ఈ క్రమంలోనే అధికారుల నేతలు అలాగే వైకాపా నేతల మధ్య మాటల యుద్ధం ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా అసెంబ్లీ కార్యక్రమాలు ముగిసిన అనంతరం నారా లోకేష్ అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన వైకాపా నేతలపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో తమని ఇబ్బంది పెట్టిన వైకాపా నాయకులు కార్యకర్తలపై చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది నాయకులు శాశ్వతంగా రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నారు. ఈ తరుణంలోనే నారా లోకేష్ ఈ విషయం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత ప్రభుత్వ హయామంలో అధికారులు టీడీపీ కార్యకర్తలను నేతలను ఎన్నో ఇబ్బందులకు గురి చేసి అరెస్టులు కూడా చేశారు. ఇలా పోలీసులు ఎంత వేధించిన కార్యకర్తలు మాత్రం ధైర్యం కోల్పోకుండా ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నారు.వైసీపీ అసభ్య పోస్టులపై ఇప్పుడు పోలీసులు చిన్ననోటీసులు ఇస్తున్నా ఆ పార్టీ నేతలు రాజకీయ సన్యాసం అంటున్నారు. నాడు తెలుగుదేశం శ్రేణులు తప్పుచేయలేదు కాబట్టే అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొన్నారు.
ప్రస్తుతం వైకాపా కార్యకర్తలు నాయకులు తప్పులు చేశారు కనుక కేసులు అంటే భయపడుతున్నారని అందుకే క్షమాపణలు చెబుతూ రాజకీయాలకు కూడా శాశ్వతంగా దూరమవుతున్నారని లోకేష్ వెల్లడించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదలదు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని లోకేశ్ చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందనే చెప్పాలి. ఇక లోకేష్ సైతం రెడ్ బుక్ లో ఎవరి పేర్లు అయితే రాశారో వారందరిని అసలు వదలనని ఇటీవల వార్నింగ్ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే.