సిట్ కార్యాలయంలో చినబాబు.. అరెస్ట్ అవకాశాలపై ఆందోళనలు?

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యూడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు అరెస్ట్ అనంతరం జైలుకు సంఈపంలో ఇంటి బోజనం ఏర్పాట్లు చేసిన చినబాబు లోకేష్.. అనంతరం హస్తినకే పరిమితమయ్యారు. న్యాయనిపుణులతో సమాలోచనల నేపథ్యంలోనే ఆయన అక్కడున్నారని టీడీపీ నేతలు చెప్పుకున్నారు.

అబ్బే అలాంటిదేమీ లేదు… బాబు తరుపున వాదించే సుప్రీంకోర్టు న్యాయవాదులంతా బెజవాడలో తిరుగుతుంటే.. లోకేష్ ఢిల్లీలో ఏమి చేస్తున్నాడని ప్రశ్నిస్తూ… అరెస్ట్ భయంతోనే హస్తినలో తలదాచుకున్నారని వైసీపీ నేతలు వెటకారమాడారు. ఈ సమయంలో కోర్టు ఆదేశాలతో ఢిల్లీలో లోకేష్ ను కలిసిన సీఐడీ అధికారులు 41ఏ నోటీసులు ఇచ్చి విచారణకు రామన్నారు.

ఈ నేపథ్యంలో ఈరోజు అమ‌రావ‌తి ఇన్నర్ రింగ్ రోడ్‌ అలైన్ మెంట్ కేసుకు సంబంధించి లోకేష్ సిట్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ విచారణ సాయంత్రం ఐదుగంటల వరకూ జరగనుంది. మద్య్లో ఒక గంట లంచ్ బ్రేక్ ఇస్తారు. ఈ విచారణలో చినబాబుతో పాటు ఆయన తరుపున ఒక న్యాయవాది కూడా ఉంటారు!

ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసులో సీఐడి ముందు విచార‌ణ‌కు జారయ్యారు నారా లోకేష్. రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పులో లోకేష్ ను విచారించేందుకు సీఐడీకి ఇటీవల ఏపీ హైకోర్టు అనుమ‌తిచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో… విచార‌ణ స‌మ‌యంలో కొన్ని నిబంధ‌న‌లు కూడా ఫాలో కావాల‌ని సూచించింది. దీంతో… రింగ్ రోడ్డు కేసులో సీఐడి ఎలాంటి ప్రశ్నలు అడిగినా స‌మాధానం చెప్పేందుకు సిద్దంగా ఉన్నాన‌ని లోకేష్ ఇప్పటికే ప్రక‌టించారు.

లోకేష్ ఈ స్థాయిలో కాన్ ఫిడెంట్ గా చెబుతుండటంతో శ్రేణుల్లో ఒకవైపు ఉత్సాహం కనిపిస్తున్నా… విచార‌ణ‌లో ద‌ర్యాప్తు అధికారులు అడిగే ప్రశ్నల‌కు లోకేష్ సూటిగా స‌మాధానాలు చెప్పనిపక్షంలో పరిస్థితులు అరెస్టుకు దారితీసే ప్రమాదం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.