స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో చంద్రబాబు అరెస్టై ఇప్పటికి సుమారు 20 అవుతోంది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ సంగతి అలా ఉంటే… అరెస్టు భయమో.. లేక, కేంద్రంలోని పెద్దలను రిక్వస్ట్ చేసుకుంటే తన తండ్రి బయటకు వాస్తారనే ఆశో తెలియదు కానీ… చినబాబు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. అక్కడే కాళ్లరిగేలా తిరుగుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో… ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోంది అంటున్నారు పరిశీలకులు.
అసలు తెలుగుదేశం పార్టీ ఎలా అవతరించింది అనేది నారా లోకేష్ కి తెలుసా తెలియదా అనేది ఇప్పుడు వినిపిస్తున్న బలమైన ప్రశ్న. తెలుగు వారి ఆత్మ గౌరవం నినాదంతో నాడు నందమూరి తారకరామారావు ఒక రాజకీయ పార్టీని స్థాపించాలని భావించి దానికి తెలుగుదేశం అని పేరు పెట్టారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏపీ ప్రజల్ని అవమానించేలా వ్యవహరిస్తున్నారనే నినాదంతో ప్రచారం చేసిన ఎన్టీఆర్ ను జనం ఆదరించారు.
ఆదరణ అనంతరం ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవానికి ఎక్కడా భంగం వాటిల్లకుండా పాలన సాగించారు. ఢిల్లీ పెద్దలు ఈయన చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చిందే తప్ప… ఈయన మాత్రం ఆత్మగౌరవాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయలేదు. ఢిల్లీకి ఏమి కావాలో చేప్పండి.. ఢిల్లీ నుంచి నాకేమీ వద్దు అనేస్థాయిలో ఎన్టీఆర్ ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లారు.
ఆయన మరణానంతరం… కన్న కూతురు వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయింది. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీని తననుంచి లక్కుని ప్రస్తుతం ఆ పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబు.. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేశారు. ఇవన్నీ ఎన్టీఆర్ ఆత్మకు అత్యధికంగా క్షోభ కలిగించిన సన్నివేశాలే అనేది పలువురు చెప్పమాట. ఈ సమయంలో కుటుంబ సభ్యులు అందరూ ఎన్టీఆర్ ఆత్మను క్షోభకు గుర్తిచేస్తే… తాను మాత్రం ఎందుకు తగ్గాలనుకున్నారో.. లేక, ఆత్మగౌరవం అంటే తెలియదో తెలియదు కానీ… ప్రస్తుతం చినబాబు కూడా అదేపనిలో ఉన్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం లోకేష్.. ఢిల్లీలోనే ఉంటున్నారు. ఈ నెల 14న ఢిల్లీ వెళ్లిన ఆయన, నాటి నుంచి ఢిల్లీ వదలడానికి సిద్ధంగా లేరని అంటున్నారు. మధ్యలో పాదయాత్ర షెడ్యూల్ బయటకు వచ్చినప్పటికీ… తూచ్ అనేశారు. దీంతో… ఢిల్లీలో నారా లోకేష్ తీరు తెలుగు సమాజం సిగ్గుపడేలా వుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఢిల్లీలో బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కోసం లోకేష్ నిరీక్షణ, వేడుకోలు చూస్తే… తెలుగు వారిగా సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందని టీడీపీకి చెందిన నాయకులు కూడా అనాల్సిన పరిస్థితి వచ్చిందని తెలుస్తుంది. సరే అపాయింట్ మెంట్ ఇవ్వని నాయకుల కోసం వెంపర్లాడుతున్నారు సరే… కనీసం తండ్రి అరెస్ట్ అనంతరం మోరల్ గా సపోర్ట్ ఇచ్చిన వారిని అయినా కలిసి కనీసం ధన్యవాదాలు చెప్పే పనికైనా పూనుకున్నారా అంటే అదీ లేదు!
దీంతో… లోకేష్ కు సంస్కారం లేదు, ఆత్మాభిమానం అసలే లేదు, ఆత్మ గౌరవం అంటే అర్ధమే తెలియదు అనే కామెంట్లు ఆన్ లైన్ వేదికగా వినిపిస్తున్నాయి. ఫలితంగా… నారా లోకేష్ కూడా ఎన్టీఆర్ ఆత్మను క్షోభకు గురిచేస్తున్నారని, ఎన్టీఆర్ ఆత్మను నారావారి ఫ్యామిలీ ఇంకా ఎన్ని జనరేషన్స్ ఇలా వేధించాలనుకుంటుందంటూ కామెంట్లు పెడుతున్నారు నందమూరి అభిమానులు!