మస్ట్ రీడ్: ఆత్మలను వేదిస్తున్న చంద్రబాబు!

బ్రతికున్నప్పుడు వేదించుకుతిన్నారంటే దానికో అర్ధం ఉంది! ఆ వేదింపుల ఫలితంగా.. డబ్బులో, ఆస్తులో, ఓట్లో, సీట్లో, పదవులో, ట్రస్టులో ఏవో వచ్చి తగలడతాయనే కోరిక అనుకోవచ్చు! అది ఎంతపాపం.. ఎంత ఘోరం.. అనేది ఫలితం ఈ జన్మలోనే అనుభవించక తప్పదని అంటుంటారు. అయితే ఆ వ్యక్తులు చనిపోయిన తర్వాత కూడా వేధించడం అనేది భావ్యం కాదు!

ఎవరైనా చనిపోతే… ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటుంటారు. భూమిపై ఉన్నప్పుడు డబ్బున్నా – పేదవాడైనా ఎవరి ఆత్మకైనా సుఖం ఉండదని.. మరణించిన అనంతరమైనా ఆ ఆత్మ సుఖపడాలని కోరుకుంటారు.. భగవంతుడిపై నమ్మకం ఉన్నవారు ప్రార్ధిస్తారు. అయితే చంద్రబాబు మాత్రం తన వ్యక్తిగత స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం ఆ ఆత్మలను కూడా ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు!

అవును… తాజాగా గద్దర్ కుటుంబాన్ని పరార్శించడానికి వెళ్లారు చంద్రబాబు. అదేముందిలే.. మనిషిగా అది అత్యంత సహజమైన విషయం కదా అనుకుంటే పొరపాటే… అసలు అక్కడ ఏమి జరిగింది, చంద్రబాబు ఎలాంటి మాటలు మాట్లాడారు, ఫలితంగా గద్దర్ ఆత్మను ఎలా డిస్టబ్ చేశారు అనేది ముఖ్యం!

నివాళులు అర్పించటానికి గద్దర్ ఇంటికి వెళ్ళారు చంద్రబాబునాయుడు. తర్వాత మీడియాతో మాట్లాడుతు… గద్దర్ గురించి నాలుగు మంచి మాటలు చెప్పారు. ఇంతవరకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అంతటితో చంద్రబాబు ఆగకుండా.. తామిద్దరి లక్ష్యం ఒక్కటేనన్నారు. ఈ ఒక్క మాటతో… ఎక్కడున్నా సరే ప్రజా గాయకుడు గద్దర్ ఆత్మ భోరుమనటం ఖాయం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

గద్దర్ ది తనదీ ఒకటే లక్ష్యం అని చెప్పేటంతకు తెగించారు చంద్రబాబు నాయుడు! మార్గాలు వేరైనా లక్ష్యం మాత్రం ఒక్కటే అని అనేశారు. ఇంతకీ ఆ లక్ష్యం ఏమిటంటే పేదల కోసం పోరాటాలు చేయటమట! ఇదే సమయంలో గద్దర్ ఆశయాలను టీడీపీ కొనసాగిస్తుందని కూడా చెప్పారు చంద్రబాబు. దీంతో చంద్రబాబుని ఆహ్వానించినవారు గద్దర్ కు సారీ చెబుతున్నారు.!

గద్దర్ పేదలపక్షంగా పోరాటాలు చేశారంటే ఎవరూ కాదనలేరు కానీ… 14 ఏళ్ళు అధికారంలో ఉన్నపుడు పేదల సంక్షేమం కోసం చంద్రబాబు చేసిన పని ఒక్కటి కూడా లేదు! గద్దర్ మీద 1997లో కాల్పులు జరిపించింది చంద్రబాబే అని అందరికీ తెలుసు. ఈ విషయం ఎవరో చెప్పటం కాదు స్వయంగా గద్దరే చాలాసార్లు చెప్పారు. అయితే అదంతా తప్పుడు ప్రచారం అని అంటున్నారు బాబు!

దీంతో… బ్రతికున్నప్పుడూ కాల్చి చంపడానికి ప్రయత్నించిన చంద్రబాబు… గద్దర్ ఆత్మను కూడా వదలడం లేదని… ఆయన ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు!

కాగా.. తన చివరి దశలో నందమూరి తారక రామారావు స్పందించిన సంగతి తెలిసిందే. తన చావుకు పరోక్షంగా చంద్రబాబే కారణం అని చాలా సార్లు చెప్పారని అంటుంటారు. ఆయన్ని మానసికంగా క్షోభకు గురిచేయడంలో చంద్రబాబు పాత్రే కీలకమని అంటుంటారు. పైగా ఆయనపై చెప్పులు కూడా వేయించిన సంగతి తెలిసిందే!

అయితే ఎన్టీఆర్ మృతి కి అన్నిరకాలుగానూ కారణం అయ్యారనే పేరు సంపాదించుకున్న చంద్రబాబు… వెలుగులోకి వచ్చిన వీడియోల ప్రకారం ఆఫ్ ద రికార్డ్ ఎన్టీఆర్ ని వాడు వీడు అని సంబోధించిన చంద్రబాబు… ఆయన వర్ధంతికి, జయంతికి అందరికంటే ముందు ఫోటోలకు దండలేయడం, ఆయన విగ్రాలకు నమస్కరించడం, ఎన్టీఆర్ గొప్పవాడు అని అనడం తెలిసిందే.

దీంతో మనిషి బ్రతికి ఉన్నప్పుడు కంటే చనిపోయిన తర్వాతే చంద్రబాబు మరీ దారుణంగా ఏడిపిస్తున్నారని… ఆత్మలు రోధించే పనులకు పాల్పడుతున్నారని అంటున్నారు పరిశీలకులు! ఏది ఏమైనా… గద్దర్ ది తనదీ ఒకటే లక్ష్యం అని చంద్రబాబు అనడం మాత్రం దారుణం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!