చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. మధ్యంతర బెయిల్ మంజూరు!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టయిన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండులో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన జైలు జీవితం 51 రోజులు పూర్తిచేసుంది. ఈ నేపథ్యంలో ఆయనకు బిగ్ రిలీఫ్ దొరికింది. ఇందులో భాగంగా… చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.

చంద్రబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటీషన్ ను విచారించిన హైకోర్టు మంగళవారం ఉదయం తీర్పిచ్చింది. ఈ క్రమంలో ఉదయమే మధ్యంతర బెయిల్ విషయంలో 4 వారాల రిలీఫ్ ఇస్తు తీర్పు చెప్పింది. అదేవిధంగా ఈ కేసు విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది. దీంతో… టీడీపీ శ్రెణులు సంబరాలు జరుపుకుంటున్నారు.

చంద్రబాబు అనారోగ్య కారణాలతోనే ఈ మధ్యంతర బెయిల్ దొరికింది. చంద్రబాబుకు జూలైలో ఎడమకంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ జరిగిందని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి డాక్టర్లు ప్రకటించారు. అనంతరం మరో మూడు నెలల్లోపు కుడి కంటికి కూడా ఆపరేషన్ చేసుకోవాలని డాక్టర్లు చెప్పారని.. ఈ నేపథ్యంలో ఆ మూడు నెలల సమయం అయిపోయిందని బాబు కోర్టుకు సూచించారు! ఈ విషయాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంది.

అయితే ఈ విషయంలో సీఐడీ లాయర్లు పెద్దగా అభ్యంతరం చెప్పలేదని తెలుస్తుంది. దీంతో… హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందని అంటున్నారు. ఇదే సమయంలో… మెయిన్ బెయిల్ పిటీషన్ ను వచ్చేనెల 10వ తేదీన విచారిస్తామని కొర్టు తెలిపింది. ఈ మద్యంతర బెయిల్ నాలుగు వారాలపాటు ఉంటుందని.. అనంతరం వచ్చేనెల 28వ తనంతట తానుగా చంద్రబాబు కోర్టులో సరెండర్ అవ్వాలని కోర్టు ఆదేశించింది. దీనికి చంద్రబాబు అంగీకరించటంతో మధ్యంతర బెయిల్ మంజూరైంది.