బాబుకు బెయిల్ రాకపోతే… భువనేశ్వరి కీలక నిర్ణయం ఇదే!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టైనప్పటినుంచీ ఆ పార్టీ కేడర్ స్థబ్ధగా మారిపోయారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటంతో పార్టీని నడిపించేవారే లేకపోయారని చెబుతున్నారు. తండ్రి లోపల ఉంటే చినబాబు బయట దున్నేస్తారని కేడర్ భావించి ఉండొచ్చు కానీ… ఆయన హస్తినకే పరిమితమయ్యారు. 4వ తేదీన సీఐడీ ఆయన్ని ఏపీకి రప్పిస్తుంది!

వాస్తవానికి మూడు రోజుల క్రితమే లోకేష్ యువగళం యాత్ర తిరిగి ప్రారంభం కావాలి. అయితే… చినబాబుపై కూడా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసు వెళాడుతున్నందున ఈ సమయంలో యాత్రకంటే బెయిల్ ముఖ్యమని భావించారని అంటున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం దానికోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.

ఈ సమయంలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించారు. అయితే ఆ యాత్రలో పసుపు జెండాలు చాలా మంది ఊహించిన స్థాయిలో లేవనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో సొంత ప్రయత్నం కచ్చితంగా ఉండాలని భావించారో ఏమో కానీ… టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపే ఆ బాధ్యత భువనేశ్వరి తీసుకుంటున్నారని తెలుస్తుంది.

అవును… చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో… చినబాబు ఈ నెల 4న సీఐడీ విచారణలో ఉంటున్న తరుణంలో… బాలకృష్ణకు ఆ బాధ్యతలు ఇవ్వడానికి అనేక అవరోధాలున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న నేపథ్యంలో… నారా భువనేశ్వరే ఆ బాధ్యతను తీసుకున్నారని అంటున్నారు. అందులో భాగంగా ఆమె బస్సు యాత్ర చేపట్టాలని భావిస్తున్నారని సమాచారం.

చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈ నెల 5న కుప్పం నుంచి బస్సు యాత్ర చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 3వ తేదీన సుప్రీంకోర్టులో బాబు క్వాష్ పిటిషన్ విచారణ అనంతరం ఈ విషయంపై ఫైనల్ డెసిషన్ ఉండొచ్చని అంటున్నారు. మరోపక్క ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్, అంగళ్లు అల్లర్ల కేసులు ఉండనే ఉన్న సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో ఈ నెల 4న సీఐడీ విచారణలో లోకేష్ సహకరించని పక్షంలో… సీఐడీ కస్టడీ కోరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బస్సు యాత్ర అనివార్యం అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా… ఈనెల 5వ తేదీ నుంచి యాత్ర ప్రారంభమైతే మొదట రాయలసీమ జిల్లాల్లో కొనసాగనుందని తెలుస్తుంది.

మరోపక్క గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు భవనేశ్వరి చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ఒకరోజు నిరసన దీక్ష చేపట్టనున్న సంగతి తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు కూడా ఈ రోజు ఉదయం 10 నుంచి 5 గంటల వరకూ నిరసన దీక్ష చేపట్టనున్నారని టీడీపీ నేతలు తెలిపారు!