భువనేశ్వరి ఓదార్పు యాత్ర… లక్ష్మీపార్వతిని పరామర్శిస్తారా?

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు నలభై రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల మరో 14 రోజులు రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు. దీంతో నవంబర్ 1 వరకూ బాబు జైల్లోనే ఉండబోతున్నారు. దీంతో ఈసారి బాబుకు దసరా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే జరుపుకోబోతున్నారు.

ఆ సంగతి అలా ఉంటే.. చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లగానే బాలయ్య సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. బాబు అరెస్టవ్వగానే కొంతమంది గుండె ఆగి మరణించారని, వారిని ఇంటింటికీ వెళ్లి పరామర్శిస్తానని ప్రకటించారు. దీంతో బాబు అలర్ట్ అయ్యారు. బాలయ్యను వ్యూహాత్మకంగా తప్పించారని అంటున్నారు. ఇందులో భాగంగా ఓదార్పు యాత్రకు “నిజం గెలవాలి” అనే నినాదంతో త్వ‌ర‌లో ఆమె జ‌నంలోకి వెళుతున్నారు.

దీంతో ఫస్ట్ టైం చంద్రబాబు భార్య భువ‌నేశ్వరి రాజ‌కీయ ప్రచారానికి సిద్ధమయినట్లయ్యింది. ఇంత వ‌ర‌కూ ఆమె ఎన్నడూ రాజ‌కీయ కార్యక‌లాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొన‌లేదు. ఈ సమయంలో ఈమె సైలంట్ గా ఉంటే బాలయ్య రంగ ప్రవేశం చేసే ప్రమాధం ఉందని గ్రహించిన బాబు… ఈ రకంగా ఆయన భార్యను జనాల్లోకి పంపుతున్నారు!

మరోపక్క లోకేష్ కూడా భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంకోసం జనాల్లోకి వెళ్లబోతున్నారు. చంద్రబాబును సెప్టెంబర్ 9న ఎక్కడైతే అరెస్ట్ చేశారో ఆ నంద్యాల నుంచే తిరిగి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ సమయంలో చంద్రబాబు కారణంగా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులు ఉన్నారని, వారి కుటుంబాలను కలిసి ఓదార్చబోతున్నట్లు పురందేశ్వరి ఫిక్సయ్యారు.

దీంతో… సోష‌ల్ మీడియా వేదికగా భువ‌నేశ్వరికి విన్నపాలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా… చంద్రబాబును అరెస్ట్ చేయడంవల్ల మ‌న‌స్తాపం చెంది ప్రాణాలు విడిచిన వారి సంగ‌తేమో కానీ, ఆయ‌న వ‌ల్ల ఎన్టీఆర్ మాన‌సిక క్షోభ‌కు గురై తుది శ్వాస విడిచార‌ని.. దీంతో ఆయన భార్య ల‌క్ష్మీపార్వతి ఒంటరైపోయారని.. అందువల్ల ముందుగా ఆమెను పరామర్శిస్తే బాగుంటుందని సూచిస్తున్నారంట.

ఫలితంగా… ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుంద‌ని, సమాజానికి కూడా మంచి సందేశం పంపినట్లవుతుందని ఆన్ లైన్ వేదిక్గా సూచిస్తున్నారంట. మరి చంద్రబాబు వల్ల చనిపోయినట్లు చెబుతున్న ఎన్టీఆర్ కుటుంబాన్ని (భార్య లక్ష్మీపార్వతి) భువనేశ్వరి పరామర్శించి ఓదార్చుతారా.. లేక, అరెస్ట్ అనంతరం చనిపోయారని చెబుతున్నవారి కుటుంబాలనే ఓదర్చుతారా అనేది వేచి చూడాలి.