ప్రస్తుతం ఏపీ రాజకీయాలు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు చుట్టూ తిరుగుతున్నాయన్నా అతిశయోక్తి కాదు. ఈ స్కాం లో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే నిన్న మొన్నటి వరకూ ఆయనది అక్రమ అరెస్ట్ అని చెప్పిన టీడీపీ నేతలు ఇప్పుడు… ఆయన ప్రాణానికి హాని ఉందని చెబుతున్నారు. దీంతో వైసీపీ నేతలు నోటికి పనిచెబుతున్నారు.
జైల్లో చంద్రబాబు ప్రాణానికి హాని ఉందని, ఆయనకు ఏమైనా అయితే ఆ బాధ్యత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దే అని తాజాగా నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఆ జైల్లో సుమారు 2000కు పైగా ఖైదీలు ఉన్నారు.. వారందరికంటే ఎక్కువగా మీ తండ్రిగారికే భద్రత, జాగ్రత్తలు కల్పిస్తున్నాం అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇదే విషయంపై జైళ్ల శాఖ డీఐజీ కూడా వివరణ ఇచ్చారు.
జైల్లో దోమలతో చంద్రబాబు మీద దండయాత్ర చేయించే అవకాశం లేదని, రెగ్యులర్ గా ఫాగింగ్ చేయిస్తున్నామని, లార్వా ఎక్కడా లేదని తెలిపారు. ఇదే విషయంపై వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ డిఫరెంట్ గా స్పందించారు. అసలు చంద్రబాబుకి ప్రాణహాని నారా లోకేష్ తోనే అని బాంబు పేల్చారు.
ఇందులో భాగంగా… ప్రస్తుతం టీడీపీకి ప్రజల్లో ఎలాంటి సానుభూతి కాని, ప్రజలకు టీడీపీ అవసరం కాని లేదన్ని లోకేష్ బాగా గ్రహించాడని అంటున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు ద్వారా సానుభూతి పొందాలని లోకేష్ తాపత్రయ పడుతునారని అన్నారు. ఇదే సమయంలో… చంద్రబాబుకు ప్రాణహాని ఉందని చెబుతున్న టీడీపీ నేతల ఫోన్స్ చెక్ చేయాలని సూచిస్తున్నారు.
అనంతరం… తాను ఎవరికీ భయపడేది లేదని చెప్పే చంద్రబాబు నాయుడు.. చిన్న చిన్న దోమలకు భయపడతారా.. అంటూ ప్రశ్నించారు నందిగాం సురేష్. ఇదే క్రమంలో.. చంద్రబాబు లాగానే లోకేష్ కి కూడా వెన్నుపోటు విద్య బాగా అబ్బినట్టు ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫలితంగా… చంద్రబాబు పదవి కోసం లోకేషే ఆ పని చేసే అవకాశం ఉందంటూ వ్యాఖ్యలు చేశారు.