23 కౌంటింగ్ తర్వాత దేశానికి కొత్త ప్రధాని నియమితులు కానున్నట్లు చంద్రబాబునాయుడు చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలోని నియోజకవర్గాల్లోని నేతలతో సమీక్షలు నిర్వహించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగుదేశంపార్టీతో పెట్టుకుంటే ఎవరికైనా పతనం తప్పదని చంద్రబాబు శాపనార్ధాలు పెట్టారు. తనతో పెట్టుకున్న తర్వాతే మోడి డౌన్ ఫాల్ స్టార్టయిందని చంద్రబాబు చెప్పటమే విచిత్రంగా ఉంది.
మోడి డౌన్ ఫాల్ స్టార్ట్ అవటమేంటో అక్కడి నేతలకు అర్ధం కాలేదు. మోడికి చంద్రబాబుకు మధ్య వివాదాలు మొదలైన దగ్గర నుండి ఇద్దరు సిఎం, పిఎంలుగానే ఉన్నారు. రేపటి కౌంటింగ్ లో చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తారా లేదా అన్నది చూసుకోవాలి. ఇక మోడి సంగతంటరా ఎన్డీఏని ఢీకొనేంత బలమైన ప్రత్యామ్నాయం జనాలకు కనిపించటం లేదు.
ఐదు విడతల పోలింగ్ సరళిని చూసినా ప్రత్యర్ధుల బలాబలాలను లెక్కేసినా సంఖ్యాబలం తగ్గిన మళ్ళీ మోడినే ప్రధాని అవుతారనే అందరూ అనుకుంటున్నారు. ఇటువంటి పరిస్ధితుల్లో ఎవరితో పెట్టుకుని ఎవరు దెబ్బతిన్నారో టిడిపి నేతలకే అర్ధం కావటం లేదు. మోడిపై జాతీయ స్ధాయిలో వ్యతిరేకత ఉందన్నది వాస్తవం. అయితే దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే స్ధితిలో విపక్షాలు లేవన్నది కూడా అంతే వాస్తవం.
విపక్షాలు అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయంటే ప్రధానమంత్రి పదవి కోసం తీవ్రంగా పోటీ పడే వాళ్ళు మమత బెనర్జీ, మాయావతి, ములాయంసింగ్ యాదవ్ లాంటి వాళ్ళు కనీసం అరడజనుమందున్నారు. వీరిలో ఏ ఒక్కరూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ గాంధి నాయకత్వాన్ని అంగీకరించే స్ధితిలో లేరు. పైగా ఒకిరి ఆధిపత్యాన్ని మరొకరు ఒప్పుకోవటం లేదు. . కాబట్టి జాతీయస్ధాయిలో మోడి వ్యతిరేకతను పెంచే పని మానుకుని రాష్ట్రం సంగతి చూసుకుంటే చంద్రబాబుకు బాగుంటుంది.