మోడికి చంద్రబాబు చెప్పిన నీతులు విన్నారా ?

తాను చేస్తే సంసారం..ఇతరులు చేస్తే డ్యాష్ డ్యాష్..అన్నట్లుంది చంద్రబాబునాయుడు వ్యవహారం. సర్వ  వ్యవస్ధలను భ్రష్టుపట్టిస్తున్న చంద్రబాబు కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడికి నీతులు చెబుతున్నారు.  ఢిల్లీ కేంద్రంగా సిబిఐలో జరుగుతున్న సంచలన మార్పులపై చంద్రబాబునాయుడు నీతులు వల్లిస్తున్నారు. కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ, అన్నీ వ్యవస్ధలను కేంద్రప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోందని తెగ బాధపడిపోయారు. నిష్పాక్షికంగా వ్యవహరిస్తుందనే పేరున్న వ్యవస్ధలను కూడా కేంద్రం తన సొంత లాభాల కోసం వాడుకోవటం చాలా బాధాకారమన్నారు. వ్యవస్ధలను తమ ఇష్టానుసారం వాడుకుంటే సమాజమే దెబ్బతినే పరిస్ధితి వస్తుందంటు చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేయటం గమనార్హం.

 

సరే ఇలా చాలనే చెప్పారు నీతులు. కేంద్రమంటే ఇక్కడ అర్ధం ప్రధానమంత్రి నరేంద్రమోడి అనే. కేంద్రంలో మోడి ఏం చేస్తున్నారో రాష్ట్రంలో చంద్రబాబు ఆ పనిని ఎప్పటి నుండో చేస్తున్నదే కదా ? ప్రత్యర్ధులపై పోలీసులను ఉసిగొల్పుతున్నదెవరు ? వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలను ప్రలోభాలకు గురిచేసి టిడిపిలోకి లాక్కున్నదెవరు ? వైసిపి నేతలపై పోలీసులు వందల కేసులు పెట్టింది నిజం కాదా ? దాదాపు పదేళ్ళ క్రితం జగన్మోహన్ రెడ్డి జైలుపాలు కావటానికి కారణమెవరు ? మూణెళ్ళు కన్నా జైలులో ఉంచేందుకు వీల్లేదని నిబంధనలు చెబుతున్నా 16 మాసాలు జైలులో జగన్ ను ఎలా నిర్భందించారు ?

 

చంద్రబాబు మీదున్న ఓటుకునోటు కేసు ఎందుకు విచారణలో ముందుకు సాగటంలేదు ? ప్రతిపక్ష ఎంఎల్ఏలకు నిధులు మంజూరు చేయకుండా ఓడిపోయిన అభ్యర్ధులనే ఎంఎల్ఏలుగా పేర్కొంటు జీవోలను చంద్రబాబు ఎలా విడుదల చేయించారు ? జన్మభూమి కమిటీల దురాగతాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచింది.

 

ఎప్పుడో షెడ్యూల్ ముగిసినా పంచాయితీ ఎన్నికలు ఎందుకు నిర్వహించకుండా స్పెషల్ ఆఫీసర్లను నియమించారో చంద్రబాబు చెప్పగలరా ? ప్రతిపక్ష శాసనసభ్యులున్న నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరపకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో చంద్రబాబు చెప్పగలరా ?  చంద్రబాబు నాలుగున్నరేళ్ళ పాలనలో అన్నీ వ్యవస్ధలను నాశనం చేస్తున్న చంద్రబాబు కూడా కేంద్రం గురించి నీతులు చెబుతుంటే ఆశ్చర్యంగా ఉంది.