Nagababu: మెగా బ్రదర్ నాగబాబు పెద్దల సభకు వెళ్తారు అంటూ గత కొద్దికొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈయనకు రాజ్యసభ స్థానం కల్పించాలన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గత మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్నారని అక్కడ ఈయన ప్రధాన మంత్రితో పాటు ఇతర కేంద్ర మంత్రులను కూడా కలిశారంటూ వార్తలు సోషల్ మీడియాలు వినిపించాయి.
వైకాపా నుంచి ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేయడంతో ఆ మూడు పదవులకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది అయితే టీడీపీ నుంచి ఇద్దరు సభ్యులు కరారు కాగా బీజేపీ నుంచి మరొకరు రాజ్యసభకు వెళ్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ కేంద్రం పెద్దలతో మాట్లాడి తన అన్నయ్యను రాజ్యసభకు పంపించడం కోసమే ఢిల్లీ వెళ్లారు అంటూ వార్తలు వచ్చాయి.
ఇలా తన రాజ్యసభ పదవి కోసం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారంటే వార్తలు వస్తున్నా నేపథ్యంలో నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ క్రమంలోనే ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లినది కేవలం ప్రజాక్షేమం కోసం మాత్రమేనని తన స్వార్థ రాజకీయాల కోసం కాదని తెలిపారు.
నాకు పదవులపై ఏ విధమైనటువంటి ఆశ లేదు నేను నా నాయకుడైన పవన్ కళ్యాణ్ కు చివరి వరకు తోడుగా ఉండి ఆయన రాజకీయ ఎదుగుదలకు దోహదపడితే చాలు అదేనా అంతిమ లక్ష్యం నాకు ఎలాంటి రాజకీయ కాంక్షలు లేవని తెలిపారు. రాజ్యసభకు వెళ్లడానికి తనకు ఇష్టం లేదని పరోక్షంగా నాగబాబు చెప్పకనే చెప్పేసారు. అయితే అలా తిరస్కరించడానికి కూడా కారణం లేకపోలేదని చెప్పాలి. ఇప్పుడు కనుక నాగబాబు పేరును రాజ్యసభకు కనుక ప్రకటిస్తే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లినది తన అన్నయ్య కోసమే అనే వార్తలు నిజమవుతాయని, తన తమ్ముడు పై అలాంటి విమర్శలు రావడం సరి కాదని భావించిన నాగబాబు తనకు ఈ పదవి ఇచ్చినా కూడా తిరస్కరించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.