AP: నా భార్యను లోబరుచుకొని 1500 కోట్ల భూములు కొల్లగొట్టారు.. విజయసాయి రెడ్డి పై శాంతి భర్త ఫిర్యాదు!

AP: వైకాపా ఎంపీ విజయ్ సాయి రెడ్డిపై దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కళింగిరి శాంతి భర్త మదన్ సంచలనమైన ఆరోపణలు చేశారు. విజయ్ సాయి రెడ్డి శాంతికి మధ్య అక్రమ సంబంధం ఉంది అంటూ గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఈమెను లోబర్చుకొని విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి సుమారు 1500 కోట్ల విలువ చేసే భూములను కొల్లగొట్టారు అంటూ తాజాగా శాంతి భర్త మదన్మోహన్ నారా లోకేష్ ని కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలపై పోరాడుతున్నందుకు తనను ఇటీవల హైదరాబాద్ నుంచి కోల్ కత్తాకు బదిలీ చేయించారని శాంతి భర్త తెలిపారు.

ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఇలా ప్రతి సోమవారం ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది పాల్గొన్న వారి సమస్యలను ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తుంటారు ఈ క్రమంలోనే మదన్ మోహన్ సైతం నారా లోకేష్ ని కలిశారు.

నేను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్ (ఐఐపి)లో అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తున్నానని, ఎంపీ విజయసాయి రెడ్డి, అడ్వకేట్ సుభాష్ కలసి తన భార్య కళింగిరి శాంతిని లోబర్చుకొని విశాఖలో ఆర్కే బీచ్ నుంచి భీమిలివరకు పెద్దఎత్తున భూములు కొల్లగొట్టారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2022-23 నడుమ నన్ను ఏమార్చి అమెరికా పంపి రహస్యంగా నా భార్యతో విజయసాయిరెడ్డి సహజీవనం చేశారని వారిద్దరు కలిసి ఒక బాబుకు జన్మనిచ్చారని తెలిపారు.

తాను స్థానికంగా ఇక్కడ లేని సమయంలో తన భార్య మగ బిడ్డకు జన్మనివ్వడంతో ఆ బిడ్డకు తండ్రి విజయసాయిరెడ్డి అని నేను గట్టిగా విశ్వసిస్తున్నానని స్పష్టం చేశారు. తనకు న్యాయం చేయాల్సిందిగా రాష్ట్రపతి, ప్రధాని కార్యాలయాలతో పాటు రాష్ట్ర హోంమంత్రి డీజీపీలను కలిసి విన్నవించానని తెలిపారు. ఇప్పటివరకు నాకు ఈ విషయంలో న్యాయం జరగలేదు మీరైనా న్యాయం చేయాలి అంటూ ఈయన లోకేష్ ని కోరారు.

తన భార్య అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసిన కాలంలో రూ.20కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించిందని, కుంచనపల్లిలో రూ.4కోట్ల విలువైన విల్లా, జగన్ ఇంటి సమీపంలో రూ.3కోట్ల విలువైన ఇంటిని కొనుగోలు చేశారు ఇలా ఖరీదైన ఇళ్లతో పాటు పలుచోట్ల విలువైన భూములు లగ్జరీకారులను కూడా కొనుగోలు చేశారు విజయసాయిరెడ్డి కుట్రలో భాగంగా బదిలీ అయిన తనని తిరిగి హైదరాబాద్ ప్రమోషన్ చేయాలి అంటూ ఈ సందర్భంగా ఈయన లోకేష్ ని కోరారు.