క్రికెటర్ సైనికుడయ్యాడు

దేశం కోసం సేవలందిస్తానంటున్న ధోనీ

“అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు అన్నీ … జరిగేవన్నీ మంచికని … అనుకోవడమే మనిషి పని ..” అని ఎప్పుడో వ్రాసిన పాత పాట ఇప్పుడు ఎం .ఎస్ ధోనీ ని చూస్తే గుర్తుకొస్తుంది . వెస్ట్ ఇండీస్ టూర్ లో ధోనీ ఎంపిక కాలేదు . ఎందుకు ? ఏమి జరిగింది ? అనేది పక్కన పెడితే ఎన్నాళ్ళుగానో తన మనసులో వున్న కోరికకు ఓ రూపం యిచ్చాడు ధోనీ . అదే భారత సైన్యంలో చేరి సేవ చెయ్యాలని . బుధవారం నాడు ధోనీ ఇండియన్ ఆర్మీ ప్యారాచూట్ రెజిమెంట్ లో చేరిపోయాడు . ఈ సంస్థ బెంగళూరులో వుంది .

ఇలాంటి అవకాశం కోసం ధోనీ చాలాకాలం నుంచి ఎదురు చూస్తున్నాడు . ఇంతకాలానికి అది నెరవేరింది . ఆర్మీ ప్యారాచూట్ రెజిమెంట్ లో ధోనీ రెండు నెలలపాటు శిక్షణ తీసుకుంటాడు . ఆ తరువాత దేశ సేవలో పాల్గొనే అవకాశం వుంది . ధోనీ లాంటి క్రికెటర్ ఇలా దేశ సేవలో పాల్గొనడం యువతీ యువకుల్లో స్ఫూర్తి నిస్తుందని చెప్పవచ్చు .

ఆర్మీ అధికారుల శిక్షణ లో ధోనీ రెండు నెలలపాటు బెంగళూరులోనే ఉంటాడు . ధోనీ నిర్ణయాన్ని ఎందరో హర్షిస్తున్నారు . దేశ సేవకుమించినది మరేముంటుంది ?