టీడీపీలో “మండే” టెన్షన్… డిసైడ్ అయితే ఫుల్ ఛేంజ్?

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడు సుమారు నెల రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ హైకోర్టులో దీనికి సంబందించిన స్క్వాష్ పిటిషన్ కొట్టేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రస్తుతం సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ విచారణలో ఉంది.

ఈ నేపథ్యంలో ఈ మండే (09-10-2023) టీడీపీకి అత్యంత ఇంపార్టెంట్ రోజు. టీడీపీ అధినేత చంద్రబాబు నెల రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటూ న్యాయపరమైన ఉపశమనం కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో… ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్లు అన్నీ ఏసీబీ కోర్టు నుంచి హైకోర్టు నుంచి చూస్తే సుప్రీంకోర్టు వరకూ వెయిటింగ్ లో ఉన్నాయి. వాటికి సంబంధించిన తీర్పులు సోమవారం వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది.

దీంతో ఈ సోమవారం ఏమి జరగబోతుంది.. మండిస్తుందా, కూల్ చేస్తుందా అనే హాట్ చర్చ టీడీపీతో పాటు ఏపీ రాజకీయాల్లోనూ నెలకొంది. ముఖ్యంగా సుప్రీం లో క్వాష్ పిటిషన్ పై ఎలాంటి తీర్పు రాబోతోంది అనేది మరింత ఆసక్తిగా మారింది. కారణం… ఆ తీర్పు తర్వాత టీడీపీ రాజకీయ భవిష్యత్తులో అతిపెద్ద మార్పు రాబోతుందని అంటున్నారు.

ఇదే క్రమంలో ముందుగా ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు సంబంధించిన పిటిషన్ల సంగతి ఒక సారి చూస్తే… ప్రస్తుతం ఈ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో బాబును తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్ ఉంది. ఈ రెండింటి మీద ఏసీబీ కోర్టు తీర్పు సోమవారం వెలువరించనుందని అంటున్నారు.

ఇదే సమయంలో ఏపీ హైకోర్టులో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ స్కాం, ఏపీ ఫైబర్ నెట్, అంగళ్ళు అల్లర్ల కేసులలో బాబు ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం వీటిపై కూడా ఒక కన్ క్లూజన్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. కారణం… స్కిల్ స్కాం తర్వాత బాబుపై వేళాడుతున్న మూడు ముఖ్యమైన కేసులు ఇవి!

ఇక అత్యంత కీలకంగా భావిస్తున్న సుప్రీంకోర్టులో దాఖలైన క్వాష్ పిటిషన్! ఈ కేసులో బాబు భవితవ్యంలో ఈ క్వాష్ పిటిషన్ కూడా అత్యంత కీలకంగా చెబుతున్నారు. మరోపక్క సుప్రీంలో మండే దీనిపై విచారణ జరుగుతుందా లేక వాయిదా పడుతుందా అన్నది చూడాల్సి ఉందని అంటున్నారు. దీనికి బలమైన కారణం ఉంది.

సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ ఏకంగా సెక్షన్ 17 ఏ అన్నది అవినీతి చేసిన వారికి రక్షణ కవచంగా ఉందని పేర్కొంటూ దాని ఉనికి మీదనే సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అది నవంబర్ 20న సుప్రీంకోర్టు ముందుకు విచారణకు వస్తుందని తెలిపిందిల్. ఈ నేపథ్యంలో… 17 ఏ నే నమ్ముకున్న చంద్రబాబు లాయర్లకు ఈ వ్యవహారం ఎలా మారుతుందనేది ఆసక్తిగా మారింది.

ఇలా ఏ రకంగా చూసుకున్నా… టీడీపీకి ఈ మండే అత్యంత కీలకమైన రోజు అనే చెప్పాలి. మరి సుప్రీంలో క్వాష్, హైకోర్టులో బెయిల్, ఏసీబీ కోర్టులో సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఎలాంటి తీర్పులు వస్తాయనేది వేచి చూడాలి!