చంద్రబాబుపై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు..పిల్లనిచ్చిన మామనే….

తెలుగుదేశంపార్టీని మహానటుడు ఎన్టీయార్ నుండి చంద్రబాబునాయుడు లాక్కున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతీసారి టిడిపి నాది నాది అంటూ మాట్లాడుతుండటంపై మండిపడ్డారు. టిడిపి తనదని అంటున్న చంద్రబాబు ఆ పార్టీ చంద్రబాబుది ఎలాగైంది ? అంటూ నిలదీశారు. ఎన్టీయార్ నుండి చంద్రబాబు పార్టీని లాక్కున్నారని స్పష్టం చేశారు.  ఎన్టీయార్ పై ఉన్న అభిమానంతోనే ఈరోజు పార్టీలో చాలామంది కంటిన్యు అవుతున్నారన్నారు.

చంద్రబాబుపై మోహన్ బాబు మండిపడటానికి కారణం ఫీజు బకాయిలు చెల్లించకపోవటమే. చిత్తూరు జిల్లా చంద్రగిరికి సమీపంలోని రంగంపేటలో మోహన్ బాబుకు శ్రీవిద్యా నికేతన్ విద్యాసంస్ధుంది. ఆ సంస్ధలో చదువుతున్న విద్యార్ధులకు సుమారు రూ 20 కోట్ల బకాయిలున్నాయంటున్నారు. గడచిన మూడేళ్ళల్లో బకాయిల కోసం ఎంత మొత్తుకున్నా చంద్రబాబు వినలేదట. ఎందుకు పట్టించుకోలేదో మోహన్ బాబే చెప్పాలి. ఎందుకంటే, వారిద్దరూ బాగా సన్నిహితులే.

ఫీజు రీ ఎంబర్స్ మెంటు, విద్యా వ్యవస్ధలను చంద్రబాబు భ్రష్టుపట్టించేసినట్లు మండిపడ్డారు. చంద్రబాబు చెబుతున్న మాటలు, చేస్తున్న హామీలన్నీ ఒట్టి అబద్దాలే అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబును ఎవరూ నమ్మరని చివరకు పిల్లనిచ్చిన మామగారినే చంద్రబాబు ఏం చేశారో అందరూ చూసిందేకదా అన్నారు. ఆ విషయంలో ఎన్టీయార్ కుటుంబసభ్యులే నోరు మూసుకుని కూర్చున్నపుడు ఇక బయటవాళ్ళకెందుకు ? అన్నారు.

చంద్రబాబంటే తనకు ఇష్టమని కానీ చంద్రబాబు విధానాలంటే మాత్రం పడదన్నారు. మొత్తానికి ఎన్నికల సమయంలో అదునుచూసి చంద్రబాబుపై మొహన్ బాబు రోడ్డెక్కారు. చంద్రబాబు హామీలను ఎవరూ నమ్మరని కూడా అన్నారు. రావాలసిన బకాయిల కోసం మోహన్ బాబు, విద్యాసంస్ధల పిల్లలతో కలిసి తిరుతపిలో లీలామహల్ సెంటర్ నుండి గాంధిరోడ్డు వరకూ బ్లాక్ చేశారు. చూడబోతే చంద్రబాబుపై మోహన్ బాబు ఎన్నికల్లో వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.