ఇపుడిదే విషయమై అనంతపురం జిల్లాలో చర్చ జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో పరిటాల శ్రీరామ్ దూకుడు మామూలుగా అయితే లేదు. అయితే, పోటీ చేయటానికి సీటూ లేదు. అందుకని ఉన్న వాళ్ళల్లోనే ఎవరినో ఒకరిని ఖాళీ చేయించి ఆ స్ధానంలో పోటీ చేయటానికి శ్రీరామ్ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరి, పరిటాల కన్నేసిన నియోజకవర్గం ఏది ? అందుకు తల్లి, మంత్రి పరిటాల సునీత మద్దతు ఎంత వరకు ఉంది ? అన్న విషయంపైనే జిల్లాలో చర్చ జరుగుతోంది.
ఇప్పటికిప్పుడు శ్రీరామ్ కు ఓ నియోజకవర్గం కావాలన్నవిషయంలో పరిటాల సునీత గట్టిగా పట్టుబట్టారు. అందుకోసం పావులు కూడా కదుపుతున్నారు. అయితే, ప్రయత్నాలన్నీ ఎక్కడికక్కడ అడ్డం తిరుగుతోంది. దాంతో పరిటాల కుటుంబంలో తీవ్ర అసహనం పెరిగిపోతోంది. చివరకు ఆ అసహనం ఏ రూపంలో ఎవరి కొంప ముంచుతుందో అని చాలామంది ఎంఎల్ఏల్లో ఆందోళన పెరిగిపోతోంది.
మొదట్లో అనంతపురం సీటుపై కన్నేశారట. కుదరలేదు. ఎందుకంటే, ఎంఎల్ఏ ప్రభాకర్ చౌదరి అడ్డం తిరిగారు. తర్వాత ధర్మవరం సీటుపై కర్చీఫ్ వేశారు. దాంతో అక్కడ చిచ్చు మొదలైంది. ఎంఎల్ఏ వరదాపురం సూరి ఏం తక్కువవాడు కాదు. గట్టిగానే పరిటాల కుటుంబాన్ని ఎదుర్కొన్నారు. దానికితోడు ధర్మవరంలో వేలు పెట్టద్దని స్వయంగా చంద్రబాబునయుడే వార్నింగ్ ఇచ్చారు. దాంతో ఆ నియోజకవర్గాన్ని వదిలేశారు.
తర్వాత తమ సొంత నియెజవర్గమైన పెనుకొండపై కన్నేశారు. కానీ అక్కడి సిట్టింగ్ ఎంఎల్ఏ పార్ధసారధి బాగా సీనియర్. అందులోను బిసి నేత. నియోజకవర్గంలో కూడా బిసిలదే డామినేషన్. వచ్చే ఎన్నికల్లో బిసిల మద్దతు పార్టీకి చాలా అవసరం. అందుకని చంద్రబాబు ఒప్పుకోలేదు. సరే చేసేదేముందని హిందుపురం ఎంపి సీటు పై కన్నేశారు. అక్కడ సిట్టింగ్ ఎంపి నిమ్మల కిష్టప్ప కూడా బిసినే. పైగా హిందుపురం ఎంఎల్ఏ, చంద్రబాబు వియ్యంకుడు కమ్ బావమరది నందమూరి బాలయ్యతో మంచి సంబంధాలున్నవాడు. కాబట్టి అక్కడడ వారి ఆటలు సాగలేదు.
చివరకు కల్యాణదుర్గం సీటుపై బాణం ఎక్కుపెట్టారట. అక్కడ సిట్టింగ్ ఎంఎల్ఏ హనుమంతరాయ చౌదరి బాగా సీనియర్. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని తనకు బదులుగా కొడుకు మారుతికి టిక్కెట్టు ఇవ్వాలని ఇప్పటికే చంద్రబాబు కు అప్లికేషన్ పెట్టుకున్నాడట. ఏమవుతుందో చూడాలి. మొత్తం మీద శ్రీరామ్ వచ్చే ఎన్నికల్లో ఏదో ఓ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యారట. మరి ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారో ? ఎవరికి స్పాట్ పెడతారో చూడాల్సిందే.
మరొక హాట్ న్యూస్