అసెంబ్లీలోకి కాలు పెట్టిన తర్వాత జనసేనకు ఉన్న ఒక్క ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకిగా మారిన సంగతి తెలిసిందే. పవన్ హెచ్చరించినా రాపాక పట్టించుకోలేదు. జనసేనలో ఉంటూనే వైకాపాకు మద్దతిస్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి సస్పెండ్ చేద్దామనకున్నా! అ రకమైన చర్యలు తీసుకోలేకపోతున్నారు. పవన్ ఏ నిర్ణయం తీసుకున్నా అది రాపాకకు కలిసొచ్చేది. సస్పెండ్ చేస్తే నేరుగా వైసీపీలోకి వచ్చేస్తారు. పార్టీలో ఉన్నప్పుడే రాపాక ఇలా చెరిగిపోతున్నారు. ఇక సస్పెండ్ చేసి…అధికారంగా వైసీపీ గూటికి చేరిన తర్వాత రాపాక జనసేన పై ఏ స్థాయిలో నిప్పులు చెరుగుతాడో? చెప్పాల్సిన పనిలేదు.
అందుకే పవన్ కూడా కామ్ గా ఉన్నారు. సీనియర్ల సలహాలు తీసుకుని సస్పెండ్ చేయడం కన్నా! పార్టీలో ఉంటే కనీసం సానుభూతైనా దక్కుతుందని భావించి క్యాడర్ ఏ నిర్ణయం తీసుకోలేదు. ఒక వేళ పవన్ కళ్యాణ్ తెగిస్తే పరిస్థితి అంతకంతకు దారుణంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాపాకను చూసి చూడనట్లు వదిలేస్తేనే మంచిదని భావించి సైలెంట్ గా ఉన్నారు అన్న ఓ కారణం వినిపిస్తోంది. పవన్ కాస్త ఆవేశపరుడు. కానీ రాపాక విషయంలో ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నట్లే కనిపిస్తోంది. పార్టీని, జనసేనని ఏమన్నా పవన్ పట్టించుకోవడం లేదు.
పవన్ పని పవన్ ది అయితే…రాపాక పని రాపాకది అనట్లే ఉంది. నిజానికి ఏ రాజకీయ పార్టీకి మరి ఇలాంటి పరిస్థితి ఎదుర వ్వదేమో! సొంత పార్టీలో ఉంటూ ! ఆ పార్టీ గుర్తుతో గెలిచి.. ఆ పార్టీ తరుపున అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతూ… ఆ పార్టీ విధానాల్ని విమర్శిస్తూ…అధికారంలో ఉన్న పార్టీని నెత్తికెక్కించుకోవడం అన్నది ఎంత వరకూ న్యాయమో రాపాకకే తెలియాలి. కారణాలు ఏమైనా రాపాక – పవన్ కళ్యాణ్ కి కలలోకి కూడా వస్తున్నట్లు పరిస్థితులను బట్టి తెలుస్తోంది.