జగన్ వైఖరిపై మిశ్రమ స్పందన

అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి వైఖరిపై ఇపుడు జనాల్లో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది.  చంద్రబాబునాయుడు, టిడిపి ఎంఎల్ఏలను ఉద్దేశించి జగన్ సభలో  మాట్లాడుతున్న తీరుపై  నెగిటివ్ కామెంట్లే వినిపిస్తున్నాయి.  చంద్రబాబు హయాంలో జగన్ అండ్ కో అసెంబ్లీలో మాట్లాడే సమయంలో  చంద్రబాబు అండ్ కో వ్యవహరించిన తీరుపైన చాలా విమర్శలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

అసెంబ్లీ సమావేశాలను జగన్ బాయ్ కాట్ చేసినపుడు జనాల్లో సింపతి వచ్చిందంటే అందుకే చంద్రబాబు వ్యవహార శైలే ప్రధాన కారణం. అసెంబ్లీలో జగన్ ను చంద్రబాబు అండ్ కో కవాలనే అవమానించారని, మైక్ కూడా సరిగా ఇవ్వలేదంటూ జగన్ పై జనాలు బాగా సానుభూతి చూపారు. అలాంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో చంద్రబాబుపై జగనే అనుచిత కామెంట్లు చేయటాన్ని చాలామంది తప్పుపడుతున్నారు.

మొన్నొక రోజు చంద్రబాబును ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ ’మీరు అధికారంలో ఉన్నపుడు గాడిదలు కాశారా’ ? అంటూ దూషించారు. నిజంగా చంద్రబాబును ఉద్దేశించి జగన్ అనాల్సిన మాటకాదు. చంద్రబాబు మూడుసార్లు సిఎంగా చేసిన 70 ఏళ్ళ నేత. అంతటి వ్యక్తిని పట్టుకుని వయస్సుకు కూడా మర్యాదు ఇవ్వకుండా అలా అనుండకూడదు.

అలాగే, అచ్చెన్నాయుడు తదితరులను ఉద్దేశించి ’మేము 151  మందిమి ఒక్కసారిగా లేస్తే మీరు అసెంబ్లీలో ఉంటారా’ ? అని కూడా మాట్లాడకూడదు. ప్రతిపక్ష సభ్యులకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత, కౌంటర్లు వేసే అవకాశం మంత్రులు, చీఫ్ విప్, ఎంఎల్ఏలకు వదిలిపెట్టేయాలి.  అంతేకానీ టిడిపి సభ్యులను కూర్చోండంటూ ఒకటికి మూడుసార్లు కసురుకున్నపుడు జగన్ బాడీ లాంగ్వేజ్ కూడా బాగాలేదంటున్నారు జనాలు. సభను ఆర్డర్లో పెట్టే బాధ్యత స్పీకర్ కు సభ్యులకు వదిలిపెట్టి తాను చూస్తు కోర్చుంటే బాగుంటుందని జనాలు సూచిస్తున్నారు.